బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 18 జూన్ 2022 (13:06 IST)

Agnipath: అగ్నివీర్లకు 10 శాతం రిజర్వేషన్

Agniveers
Agniveers
అగ్నివీర్లకు సంబంధించి కేంద్ర హోంశాఖ కీలక ప్రకటన చేసింది. అగ్నిపథ్‌లో ఎంపికై అగ్నివీర్లుగా నాలుగేళ్లు పనిచేసిన వారికి కేంద్ర సాయుధ బలగాల్లో రిజర్వేషన్ కల్పిస్తామని ప్రకటించింది. 
 
అగ్నివీర్ మొదటి బ్యాచ్ వారికి కేంద్ర సాయుధ బలగాల నియామకాల్లో గరిష్ట వయో పరిమితి 5 ఏళ్లు సడలింపు ఇవ్వనున్నట్లు కేంద్ర హోంశాఖ ప్రకటించింది.
 
అగ్నివీర్లకు కేంద్ర సాయుధ పోలీసు బలగాలు, అస్సామ్ రైఫిల్స్‌లో 10శాతం రిజర్వేషన్ కల్పిస్తామని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వెల్లడించింది.  
 
అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో కేంద్ర సాయుధ పోలీసు బలగాలు, అస్సామ్ రైఫిల్స్‌ నియామకాల్లో అగ్నివీర్లకు వయో పరిమితిని 3 ఏళ్లకు పెంచారు.