గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 7 సెప్టెంబరు 2022 (20:13 IST)

ఈ దఫా కూడా హస్తినలో దీపావళిని నిశ్శబ్ధంగా జరుపుకోవాల్సిందే... (video)

diwali
దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం విపరీతంగా పెరిగిపోతోంది. ఇది ఆందోళనకరస్థాయికి చేరుకుంది. ఇది దీపావళిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దీంతో టపాసుల పేల్చితే కఠిన చర్యలు తీసుకుంటామని ఢిల్లీ హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టు కూడా మందలించింది. ఈ ఆంక్షలు ఈ యేడాది కూడా అమలుకానున్నాయి. 
 
ఢిల్లీలో కాలుష్యం తగ్గించేందుకు ఆప్ ప్రభుత్వం కూడా తగిన చర్యలు తీసుకుంటుంది. ఇందుకోసం కఠినమైన ఆంక్షలు కూడా విధిస్తుంది. ఈ క్రమంలో గత యేడాది మాదిరే ఈ సారి కూడా దీపావళి సమయంలో టపాసులను కేజ్రీవాల్ ప్రభుత్వం పూర్తిగా నిషేధించింది.
 
టపాసులపై నిషేధం తక్షణమే అమల్లోకి వస్తుందని ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ తెలిపారు. జవనరి 1వ తేదీ వరకు నిషేధం అమల్లో ఉంటుందని ఆయన చెప్పారు. ఈసారి టపాసుల ఆన్‌లైన్ విక్రయాలపై కూడా నిషేధం విధించామని తెలిపారు. 
 
అన్ని రకాల టపాసుల ఉత్పత్తి, నిల్వ, అమ్మకాలు, వినియోగంపై నిషేధం విధిస్తున్నామని చెప్పారు. ప్రజల ప్రాణాలను కాపాడటానికి నిషేధం విధించక తప్పదని ఆయన అన్నారు. 
 
నిబంధనలను ఉల్లంఘించి ఎవరైనా టపాసులను పేల్చితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మరోవైపు, టపాసులపై నిషేధం విధించడంతో పర్యావరణ ప్రేమికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.