శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 20 జులై 2021 (19:13 IST)

హస్తినపై డ్రోన్లతో దాడికి కుట్ర : యాంటీ డ్రోన్ సిస్టమ్ మొహరింపు?

దేశ రాజధాని న్యూఢిల్లీలో భారీ విధ్వంసానికి ఉగ్రవాదులు కుట్ర పన్నినట్టు నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఈ దాడి కూడా డ్రోన్ల సాయంతో జరుగొచ్చని ఆ రాష్ట్ర పోలీసులను ఇంటెలిజెన్స్ హెచ్చరించింది. 
 
ముఖ్యంగా, ఆగస్టు 15వ స్వాతంత్ర్య దినోత్సవానికి ముందే ఈ ఉగ్రదాడికి ప్లాన్ చేస్తున్నారని, అందవల్ల అప్రమత్తంగా ఉండాలని సూచన చేసింది. టెర్రరిస్టులు, సంఘ విద్రోహశక్తులు దాడులకు పాల్పడవచ్చని వివరించాయి. 
 
కాగా ఇంటెలిజెన్స్ వర్గాల హెచ్చరికలతో ఢిల్లీ పోలీసులు అలర్ట్ అయ్యారు. ఢిల్లీ గనగ వీధుల్లో డ్రోన్లపై నిషేధం విధించే అంశాన్ని పరిశీలిస్తున్నారు. వీవీఐపీలు ఉండే ఏరియా కావడంతో యాంటీ డ్రోన్ వ్యవస్థలను మొహరించాలని భావిస్తోంది.