1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 7 మే 2025 (10:29 IST)

#OperationSindoor ఢిల్లీలో హై అలర్ట్- పంజాబ్‌లో విమానం కూలింది.. ఏమైంది? (video)

OperationSindoor
OperationSindoor
ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత దేశ రాజధానిలో భద్రతను పెంచారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత కీలక ప్రదేశాల్లో అదనపు పోలీసు సిబ్బంది, పారామిలిటరీ దళాలను మోహరించడంతో దేశ రాజధానిలో భద్రతను ముమ్మరం చేశారు.
 
దేశ రాజధాని ఇప్పటికే హై అలర్ట్‌లో ఉందని, బుధవారం సాయంత్రం 4 గంటలకు బహుళ ఏజెన్సీలు మాక్ డ్రిల్‌లను నిర్వహిస్తాయని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు.
 
ఢిల్లీ పోలీసులు పూర్తిగా అప్రమత్తంగా ఉన్నారు, శాంతిభద్రతలను ఉల్లంఘించడానికి ఎవరినీ అనుమతించరు. కీలకమైన ప్రదేశాలపై బృందాలు కఠినమైన నిఘా ఉంచాయి. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను పర్యవేక్షిస్తున్నాయని భద్రతా అధికారులు తెలిపారు. 
 
ఇదిలా ఉంటే.. ఆపరేషన్ సింధూర్ సమయంలో పంజాబ్‌లోని బతిండాలోని అక్లియన్ ఖుర్ద్ గ్రామంలో తెల్లవారుజామున 1:30 గంటలకు గుర్తుతెలియని విమానం కూలిపోయింది. ఇళ్ల నుండి 500 మీటర్ల దూరంలో గోధుమ పొలంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో ఒక వ్యవసాయ కూలీ మృతి చెందగా, 9 మంది గాయపడ్డారు.