సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 5 నవంబరు 2017 (16:31 IST)

ఉపయోగం లేని ప్రసంగాలు ఆపండి : రాహుల్ ట్వీట్

ప్రజలకు ఏమాత్రం ఉపయోగం లేని ప్రసంగాలు ఆపాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సూచించారు. ఇదే అంశంపై ఆయన ఆదివారం ఓ ట్వీట్ చేశారు. ప్రధాని మోడీ ప్రభుత్వం చేపడుతున్న ఆర్థిక

ప్రజలకు ఏమాత్రం ఉపయోగం లేని ప్రసంగాలు ఆపాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సూచించారు. ఇదే అంశంపై ఆయన ఆదివారం ఓ ట్వీట్ చేశారు. ప్రధాని మోడీ ప్రభుత్వం చేపడుతున్న ఆర్థిక విధానాలను ఆయన తూర్పారబట్టారు. ఉపయోగంలేని ప్రసంగాలను ఇకనైనా ఆపాలన్నారు.
 
మోడీ ప్రభుత్వం సామాన్యులను చాలా కష్టాలకు గురిచేస్తోందని రాహుల్ ఆవేదన చెందుతున్నారు. నిత్యావసరాల ధరలు పెరిగిపోతున్నాయని, తక్షణం గద్దె దిగాలని ఆయన డిమాండ్ చేశారు. తాజాగా ఆయన తన ట్విటర్ ఖాతాలో హిందీలో విమర్శనాస్త్రాలు సంధించారు. ఇదంతా నాలుగు లైన్లలో ఓ పద్యాన్ని తలపించేలా ఉంది.
 
'అధిక ధరకు వంటగ్యాస్, ఖరీదైన రేషన్‌.. ఉపయోగంలేని ప్రసంగాలను ఆపండి! ధరలను తగ్గించండి, ఉద్యోగాలు ఇవ్వండి.. లేదంటే ఆ పదవి నుంచి తప్పుకోండి' అని రాహుల్‌ ట్వీట్‌ చేశారు.