అమ్మ కోలుకోవాలి... శ్రీరంగంలో డీఎంకే నేతల ప్రత్యేక పూజలు.. ఇది నిజమేనా?
ఇది నిజమేనా? లేకపోతే ఏదైనా కలగంటున్నామా? అనే డౌట్ మీకూ వచ్చిందా.. అయితే ఈ స్టోరీ చదవండి. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వేళ.. తిరుచ్చి శ్రీరంగంలో డీఎంకే పార్టీ నేతలు పూజలు చ
ఇది నిజమేనా? లేకపోతే ఏదైనా కలగంటున్నామా? అనే డౌట్ మీకూ వచ్చిందా.. అయితే ఈ స్టోరీ చదవండి. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వేళ.. తిరుచ్చి శ్రీరంగంలో డీఎంకే పార్టీ నేతలు పూజలు చేశారు. ఇదేంటి అన్నాడీఎంకే కార్యకర్తలు, నేతలు ఒక వైపు అమ్మ కోలుకోవాలని ప్రార్థనలు, పూజలు, హోమాలు చేస్తుంటే.. డీఎంకే నేతలు వెటకారం కోసమో ఏమో కానీ శ్రీరంగా అమ్మ పేరిట అర్చన చేశారు. ఇంకా జయలలిత త్వరలో డిశ్చార్జ్ కావాలని డీఎంకే నేతలు స్వామివారిని వేడుకున్నారు. ఆపై తీర్థప్రసాదాలను తీసుకెళ్లారు.
శుక్రవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో శ్రీరంగం ఆలయానికి వచ్చిన 20 మంది డీఎంకే నేతలు ఈ పనిచేశారని శ్రీరంగం ఆలయ అర్చకులు వెల్లడించారు. డీఎంకే నేతలు మాట్లాడుతూ.. డీఎంకే కార్యకర్తలు పూజలు చేయడంలోనూ కారణం ఉందన్నారు. వారి కుటుంబ సభ్యులకు అమ్మ విద్యా రుణాలు ఇప్పించడంలో సహకరించారని... అందుకే అమ్మ ఆరోగ్యం కుదుటపడాలని వేడుకున్నట్లు తెలిపారు. ఇతర పార్టీలకు చెందిన వారైనప్పటికీ తమ కుటుంబానికి చెందిన వారికి విద్యారుణాలు అందజేయడంలో సహకరించిన అమ్మ వందేళ్లు జీవించాలని ఆకాంక్షించారు.