శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 19 నవంబరు 2020 (07:34 IST)

కౌజు పిట్ట గుడ్లు తింటున్నారా? ... అయితే మీరు చాలా విషయాలు తెలుసుకోవాల్సిందే!

నాన్ వెజ్ అనగానే చాలా మంది చికెన్, మటన్ వంటివే తింటుంటారు. ఐతే... కౌజు పిట్టల వాడకం ఇప్పుడిప్పుడే పెరుగుతోంది. వాటి గుడ్ల వల్ల కలిగే ప్రయోజనం తెలిస్తే... ఇక కోడి గుడ్లు మానేసి... కౌజు పిట్టల గుడ్లే తిన్నా ఆశ్చర్యం అక్కర్లేదు.
 
యూరప్, ఉత్తర ఆఫ్రికా, ఆసియా, దక్షిణ అమెరికాలో కౌజు పిట్టల్ని, వాటి గుడ్లను తింటున్నారు ప్రజలు. కోడి గుడ్లతో పోల్చితే కౌజు పిట్టల గుడ్లు చిన్నగా ఉన్నా... కోడి గుడ్ల కంటే... 30 శాతం ఎక్కువ పోషకాల్ని కలిగివుంటాయి ఈ గుడ్లు. జపాన్‌లో ఈ గుడ్ల వాడకం ఎక్కువ. ఒకేసారి 3 నుంచీ 5 గుడ్లను తినేస్తారు.

అందుకే అక్కడ వాటికి డిమాండ్ ఎక్కువ. కొంతమందికి కోడి గుడ్లు తినడం అలెర్జీ. అలాంటి వాళ్లకు క్వాయిల్ బర్డ్ ఎగ్స్ సరిగ్గా సెట్టయ్యే అవకాశం ఉంటుంది. 100 గ్రాముల కౌజు పిట్టల గుడ్లలో... 74 గ్రాముల నీరు, 158 కేలరీల ఎనర్జీ ఉంటుంది.

వాటితోపాటూ... 13 గ్రాముల ప్రోటీన్, 11 గ్రాముల ఫ్యాట్ ఉంటాయి. అలాగే... కాల్షియం, ఐరన్, షుగర్, మెగ్నీషియం, ఫాస్పరస్, పొటాషియం, సోడియం, జింక్, ఫోలేట్, విటమిన్ బి-12, విటమిన్ -ఎ, విటమిన్ -ఈ, విటమిన్ -డీ, కొలెస్ట్రాల్ ఉంటాయి.
 
కౌజు పిట్టల గుడ్ల వల్ల ఆరోగ్య ప్రయోజనాలు :
- ఈ గుడ్లు ప్రాణాంతకమైన గుండె జబ్బులు, హైబీపీ, ఆర్థరైటిస్, హార్ట్ ఎటాక్, కాన్సర్, జీర్ణ సంబంధ సమస్యల్ని తగ్గిస్తాయి.
- అలర్జీలు, కడుపులో మంటల్ని ఇవి పోగొడతాయి. తరచుగా ఈ గుడ్లు తింటే మంచిదే.
- బాడీలో హార్మోన్లు సరిగా పనిచేయాలంటే విటమిన్ బీ ఉండే క్వాయిల్ బర్డ్ గుడ్లు తినడం బెటర్.
- వ్యాధి నిరోధక శక్తిని పెంచే గుణాలు ఈ గుడ్లలో ఉంటాయి. శరీరంలో విష పదార్థాలు, భారలోహాల్ని ఇవి తరిమేస్తాయి. రక్తాన్ని క్లీన్ చేస్తాయి. మెమరీ పవర్ పెంచుతాయి. బ్రెయిన్ బాగా పనిచేస్తుంది.
- కంటిచూపు మెరుగయ్యేందుకు ఈ ఎగ్స్‌లో ఉండే విటమిన్ ఏ ఉపయోగపడుతుంది.
- కిడ్నీ, లివర్, గాల్ బ్లాడర్‌లో రాళ్లు ఉన్నవారు ఈ గుడ్లను తింటే వీటిలోని లెసిథిన్ అనే పదార్థం మేలు చేస్తుంది.
- దగ్గు, ఆస్తమా తగ్గాలంటే కౌజు పిట్టల గుడ్లను తింటుండాలి. ఊపిరి తిత్తులు బాగా పనిచేసేలా చేస్తాయి. వీటిలోని సెలెనియం అద్భుతాలు సృష్టిస్తుంది. టీబీ తగ్గాలంటే కూడా ఈ గుడ్లు తినడం మంచిది.
- పొట్టలో సమస్యలకు ఈ గుడ్లు చెక్ పెడతాయి. అల్సర్లను పోగొడతాయి. గ్యాస్ అంతు చూస్తాయి.
- లైంగిక సమస్యలు ఉన్నవారు క్వాయిల్ బర్డ్ గుడ్లను తింటే చాలు... లైంగిక కోరికలు పెరుగుతాయి. అలాగే... అంగ స్తంభన సమస్య తొలగిపోతుంది.
- ముసలి తనం త్వరగా రాకూడదని కోరుకునేవారు క్వాయిల్ బర్డ్ గుడ్లను తినాలి.
- నాడీ వ్యవస్థ సరిగా పనిచేయాలంటే ఈ గుడ్లను తింటే చాలు. తలనొప్పి, స్ట్రెస్, డిప్రెషన్, ఒత్తిడి, కంగారు పడేవాళ్లు కౌజు పిట్టల గుడ్లను తింటే మంచిది.
 
ఈ గుడ్లను మరీ ఎక్కువగా తినడం కూడా మంచిది కాదు. బరువు ఎక్కువగా ఉండేవారు... వీటిని తక్కువగా తినడమే మంచిది. ప్రెగ్నెన్సీ ఉన్న మహిళలు కూడా ఈ గుడ్లను తినకుండా ఉండటమే మేలు. రోజుకు 4 కంటే ఎక్కువ కౌజు పిట్టల గుడ్లు తినకూడదు.