మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వి
Last Modified: శుక్రవారం, 6 నవంబరు 2020 (15:38 IST)

ట్రంప్ ఎందుకు ఓడిపోతున్నారో తెలుసా? క్లారిటీ ఇచ్చిన బీజేపీ చీఫ్ నడ్డా

అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలపై దాదాపు క్లారిటీ వచ్చేసింది. ట్రంప్ ఓటమికి చేరువలో ఉన్నట్లు అర్థమవుతోంది. ఈ నేపథ్యంలో ట్రంప్ పరాజయం ఖాయమని దాదాపు అందరూ ఓ నిర్ణయానికి వచ్చేసిన సందర్భంలో బీజేపీ చీఫ్ జేపీ నడ్డా స్పందించారు.
 
బీహార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్‌ను సరిగ్గా ఎదుర్కోక పోవడమే ట్రంప్ ఓటమికి కారణం అని తెలిపారు. అదే సమయంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం కరోనాపై విజయం సాధించారని, 130 కోట్ల మందిని రక్షించగలిగారని తెలిపారు.
 
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కరోనా ప్రచారస్త్రమైందని తెలిపారు. ప్రత్యర్థి జో బైడెన్ కరోనా విషయంలో ట్రంప్ పైన విమర్శలు గుప్పించారని అన్నారు. ట్రంప్ కనుక ఓడిపోతే దానికి ప్రధానం కారణం కరోనానే అని తెలిపారు.