మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 7 సెప్టెంబరు 2020 (18:35 IST)

అమ్మో.. ఏడు కేజీల జుట్టును నమిలి మింగేసిందా?

ఆహారంలో ఏదైనా చిన్న వెంట్రుక కనిపించినా.. చిరాకు పడుతూ వుంటాం. మళ్లీ ఆహారాన్ని తీసుకోవాలంటే ఇష్టపడం. అలాంటిది ఓ యువతి ఏకంగా ఏడు కిలోల జుట్టును నమిలి మింగేసిన సంఘటన జార్ఖండ్‌లో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. జార్ఖండ్‌లోని బొకారో జిల్లాకు స్వీటీ కుమారి(17) తరచూ జుట్టు తినేది. ఇటీవల ఆమెకు కడుపు నొప్పి రావడంతో తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యుల బృందం ఆరుగంటలు శ్రమించి ఆమె కడుపులోని జుట్టుని తొలగించింది.
 
దాని బరువు సుమారు 7 కిలోలు ఉందని తెలుస్తోంది. ఈ సందర్భంగా తన 40 ఏండ్ల కెరీర్‌లో ఇలాంటి సంఘటన ఎప్పుడూ చూడలేని డాక్టర్ సాహు అన్నారు. మూడేండ్ల క్రితం ఆమెకు చేసిన అల్ట్రాసౌండ్ పరీక్షలో కడుపులో ఈ జుట్టు ఉంది. 
 
వైద్యులు అప్పుడు దానిని కణితి అనుకున్నారు. కానీ తాజాగా భారీ హెయిర్‌బాల్‌ను కనుగొన్నారు. ఈ పరిస్థితిని రాపన్జెల్ సిండ్రోమ్ అని పిలుస్తారని వైద్యులు తెలిపారు. చాలారోజుల నుంచి జుట్టును నమిలి మింగడం వల్ల ఈ అరుదైన పేగు ఏర్పడిందని వైద్యులు అంటున్నారు.