మద్యానికి బానిసైన వ్యక్తిని పిల్లనివ్వకండి.. కౌశల్ కిశోర్
కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కౌశల్ కిశోర్ కీలక వ్యాఖ్యలు చేశారు. మద్యానికి బానిసైన అధికారి కంటే.. ఓ రిక్షా కార్మికుడు.. లేదా కూలీ చేసేవాడికి అమ్మాయినివ్వ వచ్చునని.. మద్యపానానికి అలవాటైన యువకులకు.. తల్లిదండ్రులు తమ ఆడపిల్లలను ఇచ్చి పెళ్లి చేయొద్దని సూచించారు.
యూపీలోని లంభువా అసెంబ్లీ నియోజకవర్గంలో మద్యం అలవాటు విముక్తిపై నిర్వహించిన కార్యక్రమంలో కౌశల్ కిశోర్ మాట్లాడుతూ.. మద్యం తాగేవాడికి పిల్లనివ్వవద్దని సూచించారు. ఈ సందర్భంగా తన వ్యక్తిగత అనుభావాన్ని గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురైయ్యారు. తాను ఒక ఎంపీగా వుండి.. భార్య ఎమ్మెల్యేగా వుండి.. మద్యానికి అలవాటైన తన కుమారుడి ప్రాణాలను కాపాడలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు.
తన కుమారుడు రెండేళ్ల క్రితం ప్రాణాలు కోల్పోయాడని చెప్పుకొచ్చారు. అప్పుడు అతని కుమారుడి వయస్సు కేవలం రెండేళ్లే. అతని భార్య ఏకాకిగా మిగిలిందని మంత్రి వాపోయారు. ఇలాంటి పరిస్థితి మీ కుమార్తెలు, అక్కాచెల్లెళ్లను ఇలాంటి పరిస్థితి నుంచి కాపాడండని కోరారు.