సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 28 ఆగస్టు 2024 (17:12 IST)

ఫెమా ఉల్లంఘనలు... డీఎంకే ఎంపీకి రూ.908 కోట్ల అపరాధం!!

jagadrakshakan
విదేశీ మారకద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) నిబంధనల ఉల్లంఘన కేసులో తమిళనాడు రాష్ట్రంలోని అధికార డీఎంకే ఎంపీ జగద్రక్షకన్‌కు రూ.908 కోట్ల అపరాధాన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విధించింది. ఈ అపరాధాన్ని ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులందరికీ వర్తించనుంది. ఈ నెల 26వ తేదీన ఇచ్చిన తీర్పునకు లోబడి ఈ చర్యలకు ఉపక్రమించింది. 
 
అలాగే ఫెమా చట్టంలోని 37వ సెక్షన్ ప్రకారం 2020 సెప్టెంబరులో సీజ్ చేసిన రూ.89.19 కోట్లను కూడా జప్తు చేసినట్టు ఈడీ వెల్లడించింది. ఇదిలావుంటే వ్యాపారవేత్త అయిన జగద్రక్షకన్ ప్రస్తుతం అరక్కోణం ఎంపీగా కొనసాగుతున్నారు. అలాగే ఆయన అనేక వ్యాపారాలతో పాటు కాలేజీలను కూడా నిర్వహిస్తున్నారు. తమిళనాడు రాష్ట్రంలోని డీఎంకే సీనియర్ నేతల్లో ఒకరిగా ఉన్నారు.