శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : గురువారం, 23 మే 2019 (07:59 IST)

అరుణాచల్ ప్రదేశ్‌లో రీపోలింగ్.. ఈవీఎంలను ఎత్తుకెళ్లారు..

అరుణాచల్ ప్రదేశ్‌లో రీపోలింగ్ కోసం బయల్దేరిన సిబ్బందికి చేదు అనుభవం ఎదురైంది. దాదాపు 500 మంది ముసుగు మనుషులు తుపాకులతో ఎన్నికల సిబ్బందిని అడ్డుకున్నారు. వారిపై దాడికి పాల్పడ్డారు.


ఇంకా ఈవీఎంలను ఎత్తుకెళ్లారు. ముసుగులతో వచ్చిన మనుషుల వద్ద ఏకే-47 వంటి ఆయుధాలున్నాయి. ఆదివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కురుంగ్ కుమీ జిల్లాలోని నంపేలో ఈ ఘటన చోటుచేసుకుంది. 
 
ఈ విషయం వెలుగులోకి వచ్చిన వెంటనే అప్రమత్తమైన ఎన్నికల అధికారులు సోమవారం ఆ గ్రామానికి మరో ఎన్నికల బృందాన్ని పంపించారు. దీంతో మంగళవారం యథావిధిగా రీపోలింగ్ జరిగింది. ఇక పోలీసులు జరిపిన దర్యాప్తులో నిందితులు నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్‌పీపీ)కి చెందిన వారని తెలిసింది. ఇకపోతే.. అరుణాచల్ ప్రదేశ్‌లోని బీజేపీ ప్రభుత్వ కూటమిలో ఎన్‌పీపీ కూడా ఉండడం గమనార్హం.