శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 25 ఫిబ్రవరి 2020 (12:25 IST)

రాజ్యసభ ఎన్నికలకు నగారా మోగింది.. మార్చి 26న పోలింగ్

దేశంలో రాజ్యసభ ఎన్నికలకు నగారా మోగింది. మార్చి 26న రాజ్యసభ ఎన్నికలు నిర్వహించబోతున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. 15 రాష్ట్రాల్లో 55 రాజ్యసభ స్థానాలకు షెడ్యూల్ విడుదలైంది.

ఏపీలో 4, తెలంగాణలో రెండు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణ నుంచి కేవీపీ, గరికపాటి మోహన్‌ రావుల పదవీ కాలం ముగియనుంది. 
 
అటు ఏపీలో కే కేశవరావు, తోట సీతారామలక్ష్మి, సుబ్బిరామి రెడ్డి, ఏకే ఖాన్‌ల స్థానాలు ఖాళీకానున్నాయి. దీంతో ఆయా స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. అయితే ఏపీలో ఒక స్థానాన్ని.. బీజేపీకి ఇస్తారా.. లేదా అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది.

ఇటు తెలంగాణలో కూడా రాజ్యసభ పదవి ఎవరికి దక్కుతుందోనని సందిగ్ధత నెలకొంది. ఇక మార్చి 26వ తేదీ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ పోలింగ్ కొనసాగనుంది.
 
ఎన్నికల షెడ్యూల్ వివరాల్లోకి వెళితే.. 
మార్చి 6న నోటిఫికేషన్
మార్చి 13 నామినేషన్ల స్వీకరణకు తుదిగడువు
మార్చి 16న రాజ్యసభ అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన
మార్చి 18న నామినేషన్ల ఉపసంహరణకు తుదిగడువు