గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : ఆదివారం, 21 మార్చి 2021 (10:12 IST)

'కొవాగ్జిన్‌'కు నేపాల్‌లో అత్యవసర అనుమతి

భారత్‌ బయోటెక్‌ రూపొందించిన కరోనా వైరస్‌ టీకా కొవాగ్జిన్‌కు నేపాల్‌ ప్రభుత్వం గ్రీన్‌ సిగల్‌ ఇచ్చింది. నేపాల్‌కు చెందిన నేషనల్‌ డ్రగ్‌ రెగ్యులేటరీ అథారిటీ 'కొవాగ్జిన్‌' టీకాకు అత్యవసర అనుమతి మంజూరు చేసింది. దీంతో కొవాగ్జిన్‌ టీకాకు అనుమతి ఇచ్చిన మూడో దేశం నేపాల్‌ కావడం గమనార్హం.

భారత్‌లో అత్యవసర వినియోగం కింద ఆమోదం పొందిన ఈ వ్యాక్సిన్‌న ఈ నెల మొదటి వారంలో జింబాబ్వే కూడా అత్యవసర అనుమతి ఇచ్చింది. తాజమూడో దశ క్లినికల్‌ పరీక్షలకు సంబంధించిన మధ్యంతర విశ్లేషణలో ఈ టీకా 81% ప్రభావశీలత కలిగినదిగా తేలింది. ఈ వ్యాక్సిన్‌ అనుమతి కోసం నేపాల్‌ జనవరిలోనే దరఖాస్తు చేసింది.

అలాగే నేపాల్‌లో సీరమ్‌ ఇనిస్టిట్యూట్‌ తయారు చేస్తున్న 'కొవిషీల్డ్‌' టీకాకు అత్యవసర అనుమతి ఉంది. మన దేశం నేపాల్‌కు 10 లక్షల డోసుల కొవిషీల్డ్‌ టీకా సరఫరా చేసింది. మరో 20 లక్షల డోసుల టీకాలను పంపిణీ చేసేందుకు సిద్దమైంది.