బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : మంగళవారం, 28 ఆగస్టు 2018 (15:08 IST)

భర్తను వేధించిన భార్య.. ఎందుకోసమో తెలుసా?

భార్యను కట్నం కోసం వేధించే భర్త గురించి వినేవుంటాం. అయితే ఇక్కడ సీన్ రివర్స్ అయ్యింది. భార్య వేధింపులను భరించలేక భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆదివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

భార్యను కట్నం కోసం వేధించే భర్త గురించి వినేవుంటాం. అయితే ఇక్కడ సీన్ రివర్స్ అయ్యింది. భార్య వేధింపులను భరించలేక భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆదివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని ఈరోడ్ జిల్లాకు చెందిన రమేశ్ (50) కు భార్య లలిత (45), కుమారుడు శ్రీధర్ ఉన్నాడు. 
 
అయితే రమేష్ పేరు మీద బ్యాంకులో రూ.2 కోట్ల నగదు ఉంది. అంతేకాకుండా ఇళ్లు, షాపులపై నెలకు రూ.30 వేల వరకూ అద్దెలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తల్లీకుమారులు కలిసి ఆస్తి తమ పేరిట రాసివ్వాలని రమేష్‌ను డిమాండ్ చేశారు. ఇందుకు రమేష్ ఒప్పుకోకపోవడంతో వారం రోజుల పాటు చిత్ర హింసలకు గురిచేశారు. ఆదివారం రమేష్ అరుపులు విన్న స్థానికులు బంధువులకు సమాచారం ఇచ్చారు.
 
దీంతో రమేష్‌ను బంధువు గోపాల్ ఈరోడ్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆసుపత్రి వర్గాల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడంతో పాటు భార్య కుమారుడిని కటకటాల వెనక్కి నెట్టారు.