పోలింగ్ కేంద్రాల్లో అన్నీ సదుపాయాలు.. దివ్యాంగులు, గర్భిణీ స్త్రీలకు...?
లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. దేశవ్యాప్తంగా 10.5 లక్షల పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నామని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. సులభతరమైన ఓటింగ్ కోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకంటామని తెలిపారు.
ఓటరుకు ఎలాంటి అసౌకర్యం లేకుండా పోలింగ్ బూత్‌లలో అవసరమైన సదుపాయాలను కల్పిస్తున్నట్టు రాజీవ్ కుమార్ వెల్లడించారు. పోలింగ్ స్టేషన్లలో ఓటర్ ఫెలిసిటేషన్ సెంటర్, హెల్ప్‌డెస్క్, సిగ్నేజ్, షెడ్, తగిన లైటింగ్ సౌకర్యం ఉంటుందని, కనీస మౌలిక సదుపాయాలు కల్పిస్తామని రాజీవ్ కుమార్ చెప్పారు.
దివ్యాంగులు, గర్భిణీ స్త్రీలు సులువుగా పోలింగ్ కేంద్రాలకు వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తామన్నారు. ఎన్నికలు అత్యంత పారదర్శకంగా, స్వేచ్ఛగా, సజావుగా జరిపేందుకు ఎన్నికల సంఘం కట్టుబడి ఉందని చెప్పారు.