ఉరేసుకున్న పంజాబ్ మాజీ మంత్రి?
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఓ మాజీ మంత్రి ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన పేరు రాజీందర్ పాల్ సింగ్. ఈ యేడాది మార్చిలో కరోనా బారినపడిన ఆయన చికిత్స అనంతరం కోలుకున్నారు. అయితే, ఆ తర్వాతి నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.
ఈ నేపథ్యంలో రాజ్‌నంద్‌గావ్ జిల్లా చురియా పట్టణంలో తన నివాసంలో భాటియా ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు వెల్లడించారు. ఆయన ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.
మరోవైపు, ఆయన నివాసం నుంచి సూసైడ్ నోట్ లభించిందా? లేదా? అన్న విషయాన్ని పోలీసులు నిర్ధారించలేదు. రాజీందర్ భార్య కొన్నేళ్ల క్రితమే చనిపోగా, ఆయన కుమారుడు జగ్జీత్‌సింగ్ భాటియా రాయ్‌పూర్‌లో ఓ ఆసుపత్రి నిర్వహిస్తున్నారు.
రాజీందర్‌పాల్‌సింగ్ (72) రాజ్‌నంద్‌గావ్ జిల్లాలోని ఖుజ్జి అసెంబ్లీ స్థానం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన రాజీందర్.. ముఖ్యమంత్రి రమణ్‌సింగ్ నేతృత్వంలోని బీజేపీ తొలి ప్రభుత్వంలో వాణిజ్య, పరిశ్రమలశాఖ సహాయమంత్రిగా పనిచేశారు.