బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 10 ఫిబ్రవరి 2022 (13:03 IST)

డమ్మీ కరెన్సీ కాగితాల మోసం.. నలుగురు అరెస్ట్

డమ్మీ కరెన్సీ కాగితాలతో మోసాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుండి 26.8లక్షల విలువగల నకిలీ 2వేల నోట్లతో పాటు వివిధ రకాల రసాయనక ద్రావణాలు, స్వాధీనం చేసుకున్నారు. ఎనిమిది మంది సభ్యుల ముఠాలోని నలుగురు సభ్యులను అరెస్ట్ చేశారు. 
 
అదనపు సంపాదన కోసం మోసాలకు సిద్ధపడ్డారు ఎనిమిది మంది సభ్యులు. నకిలీ నోట్ల దందాతో పాటు రైస్ పుల్లింగ్‌కి ప్లాన్ చేశారు. అందులో భాగంగా 50 వేల అసలు నోట్లకు మూడురెట్ల నకిలీ నోట్లను ఇచ్చేలా ఒప్పందం చేసుకొని పోలీసుల నకిలీ నోట్లు పట్టు పడకుండా ఉండేందుకు ప్లాన్ చేశారు.
 
ఎవరికీ అనుమానం రాకుండా వుండేందుకు రెండువేల రూపాయల నకిలీ నోట్లను నలుపు కాగితాలుగా మార్చి, వాటిని తిరిగి నలుపు రంగులో వున్న కాగితాలను రసాయన ద్రావణంతో శుభ్రం చేయడంతో తిరిగి నలుపు కాగితాలు 2వేల నకిలీ నోట్లుగా మార్చే ప్రక్రియను వీడియో తీశారు నిందితులు.