శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 3 జూన్ 2021 (13:00 IST)

తండ్రికి అంత్యక్రియలు.. కుప్పకూలిన కుమారుడు.. మృతి

కోవిడ్‌తో మృతి చెందిన తండ్రికి అంత్యక్రియలు నిర్వహిస్తున్న సమయంలోనే కుప్పకూలిన కుమారుడు కాసేపటికే కన్నుమూసిన సంఘటన దక్షిణ కన్నడ జిల్లా బంట్వాళ తాలూకా పూన్చా గ్రామం బైలుగుత్తిలో బుధవారం చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. కొప్పళకు చెందిన రిటైర్డు ప్రొఫెసర్‌ భుజంగశెట్టి (64) కుటుంబం బైలుగుత్తిలో నివసిస్తోంది. భుజంగశెట్టికి కొవిడ్‌ రాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందారు. బుధవారం అంత్యక్రియలు నిర్వహించారు. 
 
అంత్యక్రియల వేళ కుమారుడు శైలేష్‌ ఒక్కసారిగా కుప్పకూలాడు. వెంటనే బంధువులు పుత్తూరు ఆసుపత్రికి తరలించగా చికిత్సలు ఫలించక మృతి చెందాడు. ఒకే ఇంట్లో తండ్రీ కొడుకు మృతిచెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది.