గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : బుధవారం, 22 నవంబరు 2017 (15:05 IST)

నిత్యానంద-రంజిత వీడియో క్లిప్పింగ్స్ ఒరిజినలే...ఫోరెన్సిక్స్ రిపోర్ట్

2010లో నిత్యానంద-రంజితలు కలిసి పడకగదిలో ఉన్న వీడియో క్లిప్పింగ్స్‌ను ప్రముఖ తమిళ టీవీ ఛానల్ ప్రసారం చేసి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. దీనిపై బెంగుళూరు, చెన్నైలలో కేసులు జరుగుతున్నాయి. దీనిపై నిత

2010లో నిత్యానంద-రంజితలు కలిసి పడకగదిలో ఉన్న వీడియో క్లిప్పింగ్స్‌ను ప్రముఖ తమిళ టీవీ ఛానల్ ప్రసారం చేసి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. దీనిపై బెంగుళూరు, చెన్నైలలో కేసులు జరుగుతున్నాయి. దీనిపై నిత్యానంద, రంజితలు గతంలో మాట్లాడుతూ.. ఆ వీడియో టేపులు నిజమైనవి కావన్నారు. సన్‌టీవీ, నక్కీరన్ అధిపతులు ఆ టేపులు చూపి తమని బ్లాక్­మెయిల్ చేశారని ఆరోపించారు. 
 
ఈ నేపథ్యంలో వీడియో బయటపడటంతో నిత్యానంద ఆధ్యాత్మిక ముసుగులో భక్తులను మోసం చేశారంటూ కేసు నడిచింది. అయితే తనలో లైంగిక పటుత్వం లేదని, ఆ వీడియోలో ఉన్నది తాను కాదని స్వామి నిత్యానంద వాదించడంతో పాటు ప్రకటన కూడా చేశారు. 
 
ఈ నేపథ్యంలో ఆ వీడియో టేపులు వాస్తవమా? కాదా?.. వాటిని ఎవరైనా తయారు చేసి స్వామీజీ ప్రతిష్ఠను దిగజార్చే ప్రయత్నం చేశారా? అనే దానిపై నిగ్గుతేల్చేందుకు ఆ టేపులను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. వీటిని పరిశీలించిన నిపుణులు.. వాటిని ఎవరో సృష్టించలేదని.. అవి ఒరిజినల్ టేపులేనని నిర్ధారించారు.