బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : గురువారం, 1 జూన్ 2017 (16:35 IST)

ప్రైవేట్ పాల గురించి నోరెత్తకు బాలాజీ.. బాబు అనుకుంటే ఎమ్మెల్యేలు ఊడిపోతారు..

తమిళనాడులో సరఫరా అయ్యే ప్రైవేట్ పాలలో రసాయనాలు కలుపుతున్నారని తమిళనాడు రాష్ట్ర మంత్రి కేటీ. రాజేంద్ర బాలాజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రైవేట్ పాలల్లో రసాయనాలున్నాయని తాను నిరూపిస్తానని, లేదంటే తన పదవిక

తమిళనాడులో సరఫరా అయ్యే ప్రైవేట్ పాలలో రసాయనాలు కలుపుతున్నారని తమిళనాడు రాష్ట్ర మంత్రి కేటీ. రాజేంద్ర బాలాజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రైవేట్ పాలల్లో రసాయనాలున్నాయని తాను నిరూపిస్తానని, లేదంటే తన పదవికి రాజీనామా చేసి ఉరి కంబంలో వేలాడటానికి సిద్దంగా ఉన్నానని రాజేంద్ర బాలాజీ సవాలు చేశారు. హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించడానికి తాను సిద్దంగా ఉన్నానని స్పష్టం చేశారు. 
 
అయితే బాలాజీ కామెంట్స్‌తో తమిళనాడు సీఎం పళని సామి తలపట్టుకున్నారు. అయ్యా.. బాలాజీ పాల సంగతి నీకెందుకు..? నీ పనేంటో చూసుకో బాబూ.. అంటూ చెప్పేశారు. ఇంకా పాల సంగతిపై నోరెత్తకు సుమీ అంటూ నోరుమూయించారు. బాలాజీ పాల వ్యాఖ్యలపై ఇప్పటికే తమిళ ప్రజల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోజూ వాడే అత్యవసర పాలలో రసాయనాలున్నాయని కామెంట్స్ చేయడంపై ప్రజలు మండిపడుతున్నారు.
 
ఇంకా విపక్షాలు సైతం ప్రజల విషయంలో చెలగాటం ఆడొద్దని వార్నింగ్ ఇచ్చాయి. అయితే గిండి, మాధవరంలోని ప్రభుత్వం పరిశోధనా కేంద్రంలో సాగిన పరిశీలనలో కొన్ని రకాల మిశ్రమాలతో పార్మా డిలైట్ అన్న రసాయనాన్ని గుర్తించడం జరిగిందని మంత్రి రాజేంద్ర బాలాజీ స్పష్టం చేశారు. ఈ పాల శాంపిల్స్‌ను కూడా బెంగళూరుకు పంపామన్నారు. ఆ పరిశోధనలో పాలలో కెమికల్స్ వున్నట్లు తేలే అవకాశం లేకపోలేదన్నారు. 
 
ఈ నేపథ్యంలో బాలాజీ వ్యాఖ్యలతో ఏపీ సీఎం చంద్రబాబు కంపెనీ అయిన హెరిటేజ్‌కు నష్టాలొచ్చాయని టాక్. అంతేగాకుండా పాల వ్యాపారులు సైతం తమ వ్యాపారానికి నష్టాలు తప్పవంటున్నారు. దీంతో పళనిసామి రంగంలోకి దిగారు. ప్రైవేట్ పాల జోలికి వెళ్ళొద్దని బాలాజీకి హితవు పలికారు. 
 
ప్రైవేట్ పాల విక్రయాల విషయంలో చంద్రబాబు నాయుడు దృష్టి పెడితే మనం ప్రభుత్వం కుప్పకూలిపోయే అవకాశం ఉందని పళనిసామి మంత్రి రాజేంద్ర బాలాజీ దగ్గర ప్రస్తావించారని సమాచారం. చంద్రబాబు నాయుడు తన పలుకుబడి ఉపయోగిస్తే మనకు మద్దతు ఇస్తున్న పది నుంచి 20 మంది ఎమ్మెల్యేలు చేజారిపోయే అవకాశం ఉందని.. తద్వారా ప్రభుత్వం కుప్పకూలిపోతుందని పళనిసామి బాలాజీకి చెప్పినట్లు సమాచారం. అందుకే ప్రైవేట్ పాల విషయంలో రెండు మూడు రోజుల నుంచి మంత్రి రాజేంద్ర బాలాజీ మౌనంగా ఉన్నారని టాక్.