మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : ఆదివారం, 12 ఆగస్టు 2018 (16:23 IST)

విషమంగా లోక్‌సభ మాజీ స్పీకర్ సోమనాథ్ ఛటర్జీ ఆరోగ్య పరిస్థితి

లోక్‌సభ మాజీ స్పీకర్ సోమనాథ్ ఛటర్జీ ఆరోగ్య పరిస్థితి విషమంగా వుంది. లోక్‌సభ మాజీ స్పీకర్ సోమనాథ్ మూత్ర పిండాల వ్యాధితో బాధపడుతూ కోల్‌కతాలోని ఓ ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

లోక్‌సభ మాజీ స్పీకర్ సోమనాథ్ ఛటర్జీ ఆరోగ్య పరిస్థితి విషమంగా వుంది. లోక్‌సభ మాజీ స్పీకర్ సోమనాథ్ మూత్ర పిండాల వ్యాధితో బాధపడుతూ కోల్‌కతాలోని ఓ ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై వైద్యులు చికిత్స అందిస్తున్నారు. సోమనాథ్ ఛటర్జీ 1971 నుంచి 2009 వరకు లోక్‌సభ సభ్యుడిగా ఉన్నారు. మధ్యలో 1984లో ఆయన తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీ చేతిలో ఓడిపోయారు. 
 
1968లో సిపిఎంలో చేరిన ఛటర్జీ, 2008 వరకు అదే పార్టీలో కొసాగారు. యుపీఏ-1 ప్రభుత్వంలో ఆయన లోక్‌సభ స్పీకర్‌గా పని చేశారు. యుపీఏ-1కి సీపీఎం మద్ధతు ఉపసహరించుకున్నప్పటికీ, ఆయన లోక్‌సభ స్పీకర్‌గా కొనసాగారు. భారత్- అమెరికాల మధ్య అణు ఒప్పందం సందర్భంగా ఆయన్ని పార్టీ నుంచి తప్పించిన సంగతి తెలిసిందే.