శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 2 జులై 2019 (13:10 IST)

ఊడిపడిన ఆయిల్ ట్యాంకు.. భారత యుద్ధ విమానాల దుస్థితికి నిదర్శనం?

భారత యుద్ధ విమానాల దుస్థితిని తెలియజేసే మరో సంఘటన ఒకటి జరిగింది. భారత వాయు సేనకు చెందిన తేలికపాటి యుద్ధ విమానమైన తేజస్ వార్ ఫ్లైట్ నుంచి ఆయిల్ ట్యాంకు ఊడి కిందపడిపోయింది. ఈ విషయాన్ని గుర్తించిన పైలట్ చాకచక్యంగా విమానాన్ని పొలాల్లో ల్యాండింగ్ చేశాడు. దీంతో ప్రాణనష్టం తప్పింది. 
 
తమిళనాడు రాష్ట్రంలో ఈ ఘటన జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, తేజస్ విమానం ఒకటి గాల్లో చక్కర్లు కొడుతుండగా, దానికివున్న ఇంధన ట్యాంకు (ఫ్యూయల్ ట్యాంకు) వేరుపడి పొలాల్లో పడిపోడింది. ఆ సమయంలో కింద ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. 
 
ఇంధన ట్యాంక్ ఊడిపోయిన విషయాన్ని పసిగట్టిన పైలట్ చాకచక్యంగా వ్యవహరించి, విషయాన్ని ఎయిర్ బేస్‌కు తెలిపి, జాగ్రత్తగా ల్యాండింగ్ చేశాడు. సూలూరు ఎయిర్‌ బేస్‌కు సమీపంలోని పొలాల్లో పడివున్న ట్యాంక్‌ను గుర్తించిన అధికారులు, జరిగిన ఘటనపై విచారణకు ఆదేశించారు.