గురువారం, 2 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 16 డిశెంబరు 2021 (15:22 IST)

చీఫ్ ఆఫ్ స్టాఫ్ కమిటీ ఛైర్మన్‌గా ఎంఎం.నవరాణే నియామకం

భారత ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ కమిటీ ఛైర్మన్‌గా భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నవరాణే నియమితులయ్యారు. కొత్త సీడీఎస్ ఎంపిక పూర్తయ్యేంత వరకు నవరాణే ఈ పదవిలో కొనసాగుతారు. 
 
ఈ నెల 8వ తేదీన తమిళనాడు రాష్ట్రంలోని నీలగిరి జిల్లాలో జరిగిన హెలికాఫ్టర్ ప్రమాదంలో భారత మహాదళపతి బిపిన్ రావత్‌తో పాటు మొత్తం 14 చనిపోయారు. దీంతో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) పదవి ఖాళీగా ఉంది. దాన్ని భర్తీ చేసేంతవరకు పాత పద్దతిని కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 
 
ఈ క్రమంలో గతంలో అమలులో ఉన్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ కమిటీ ఛైర్మన్ పదవిని నవరాణేతో భర్తీ చేసింది. త్రివిధ దళాధిపతుల్లో నవరాణే సీనియర్ కావడంతో ఆయనకు బాధ్యతలు అప్పగించారు. సీడీఎస్ పోస్ట్ క్రియేట్ చేయడానికి ముందు త్రివిధ దళాధిపతుల్లో సీనియర్ అయిన అధికారి చీఫ్ ఆఫ్ స్టాఫ్ కమిటీ ఛైర్మన్‌గా వ్యవహించేవారు. కొత్త సీడీఎస్ పూర్తయ్యేంత వరకు నవరాణే ఈ పదవిలో ఉంటారు.