శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 10 అక్టోబరు 2020 (10:33 IST)

గోవాలో నరేంద్ర మోదీ కల నెరవేరింది.. ఎలాగో తెలుసా?

ప్రధానమంత్రి నరేంద్రమోదీ కల గోవాలో నెరవేరింది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతీ ఇంటికి 2024కల్లా గర్ నల్ జల్ కనెక్షన్ ఇవ్వాలనే ఆయన కల సాకారం అయ్యింది. కేంద్ర ప్రభుత్వ జలజీవన్ మిషన్ ఆధ్వర్యంలో హర్ ఘర్ నల్ జల్ యోజన పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లోని 2.30 లక్షల ఇళ్లకు నల్లా కనెక్షన్లు ఇచ్చి దేశంలో ఇంటింటికి నల్లాలు ఇచ్చిన రాష్ట్రంగా గోవా నిలిచింది. 
 
గోవా రాష్ట్రంలో 2.30లక్షలమందికి నల్లా కనెక్షన్లు ఇచ్చి వందశాతం నీరందిస్తున్న రాష్ట్రంగా నిలిచిందని కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ ప్రకటించింది. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతీ ఇంటికి నల్లా కనెక్షన్లు ఇచ్చి మంచినీటిని సరఫరా చేస్తున్నామని గోవా సీఎం ప్రమోద్ సావంత్ చెప్పారు.
 
నార్త్ గోవాలో 1.65 లక్షలు, దక్షిణ గోవాలో 98,000 ఇళ్లకు నల్లా కనెక్షన్లు ఇచ్చారు. 191 గ్రామ పంచాయతీల్లో పూర్తిగా వందశాతం నల్లా కనెక్షన్లు ఇచ్చారు. మంచినీటి పరీక్షలు చేసేందుకు 14 వాటర్ క్వాలిటీ టెస్టింగ్ లాబోరేటరీలను గోవా ఏర్పాటు చేసింది. జలజీవన్ మిషన్ కింద ప్రతీ గ్రామంలోనూ ఐదుగురు సభ్యులకు వాటర్ టెస్టు కిట్లను అందజేశారు.