సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 10 మార్చి 2021 (19:39 IST)

సింహాన్ని వేధించారు.. ఏడుగురికి మూడేళ్ల జైలుశిక్ష.. ఏం జరిగిందంటే..?

ఓ సింహాన్ని ఏడుగురు వేధించారు. ఇదేంటి? సింహ రాజును మానవులు వేధించడమా అనుకుంటున్నారు కదూ. ఐతే చదవండి. కోడిని ఎరవేసి సింహాంతో పరచకాలాడారు. గుజరాత్‌లోని గిర్ అడవిలో ఓ సింహాన్ని ఏడుగురు వ్యక్తులు వేధించారు. వీరిలో ముగ్గురు టూరిస్టులు కూడా ఉన్నారు. 
 
2018లో ఈ ఘటన జరుగగా వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అహ్మదాబాద్‌కు చెందిన ముగ్గురు పర్యాటకులతో సహా ఏడుగురిని దోషులుగా గిర్ గధాడ జ్యూడీషియల్ మెజిస్ట్రేట్ సునీల్ కుమార్ దేవ్ ప్రకటించారు.
 
వీరిలో ఆరుగురు నిందితులకు మూడేళ్ల కఠిన కారాగార శిక్ష, మరొకరికి ఏడాది జైలు శిక్ష ఖరారు చేశారు. గిర్ అడవుల్లో బాబారియా పరిధిలోని ధూంబకారియాలో కొందరు వ్యక్తులు ఓ కోడిని సింహానికి ఎరగా వేసి దాన్ని ఇబ్బంది పెట్టారు. 
 
హింసించి పైశాచికానందం పొందారు. వాళ్లు చేసిన ఈ ఘనకార్యాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వీళ్లు చేసింది వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు 2018 మే నెలలో నిందితులను ఎనిమది మంది నిందితులను అరెస్టు చేశారు. 
 
వన్యప్రాణి రక్షణ చట్టం సెక్షన్ 2 (16) (బి) చట్టం కింద ఆరుగురికి మూడేళ్ల శిక్ష, మరో దోషి మీనాకు సెక్షన్ 27 ప్రకారం ఏడాది కఠిన కారాగార శిక్ష విధించింది. దోషులకు రూ.10వేల చొప్పున జరిమాని విధించింది గుజరాత్ కోర్టు. అనంతరం సింహాల సంక్షేమ నిధికి మరో రూ.35,000 జమ చేయాలని ఆదేశాలు జారీ చేసింది.