మంగళవారం, 12 ఆగస్టు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 21 ఏప్రియల్ 2018 (09:03 IST)

బాలికలపై ఎవరైనా అత్యాచారం చేస్తే ఇక ఉరిశిక్షే...

ఉన్నావ్ (యూపీ), కఠువా (జమ్మూకాశ్మీర్) ప్రాంతాల్లో జరిగిన అత్యాచార ఘటనలు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నారు. ఇకపై 12 ఏళ్ల లోపు బాలికలపై ఎవరైనా అత్యాచారం చేస్తే వారికి మరణదండన తప్పదు.

ఉన్నావ్ (యూపీ), కఠువా (జమ్మూకాశ్మీర్) ప్రాంతాల్లో జరిగిన అత్యాచార ఘటనలు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నారు. ఇకపై 12 ఏళ్ల లోపు బాలికలపై ఎవరైనా అత్యాచారం చేస్తే వారికి మరణదండన తప్పదు. కేంద్ర మంత్రివర్గం శనివారం సమావేశమై ఇందుకు సంబంధించి ఓ ఆర్డినెన్స్‌ను తెచ్చే అంశాన్ని పరిశీలించి ఖరారు చేస్తుంది. 
 
ఇది వెంటనే జారీ అవుతుందని ఉన్నతస్థాయి ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. లైంగిక అత్యాచార ఘటనల నుంచి పిల్లలను సంరక్షించే చట్టం(పోస్కో)కు సవరణ చేస్తూ తెచ్చే ఈ ఆర్డినెన్స్‌ను తక్షణం అమలు చేయాలని నిర్ణయించారు.
 
ఆర్డినెన్స్‌‌స్థానే తీసుకునిరాబోయే చట్టాన్ని పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెడతారు. ఇన్నాళ్లూ మైనర్లను రేప్‌ చేస్తే విధించే కఠిన శిక్ష అత్యధికంగా జీవిత ఖైదు (14 ఏళ్లు)... అత్యల్పంగా ఏడేళ్లు. ఈ నేపథ్యంలో పోస్కో చట్టానికి సవరణ తేనున్నట్లు కేంద్రం శుక్రవారం అధికారికంగా సుప్రీంకోర్టుకు కూడా తెలియజేసింది.