శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 23 జులై 2019 (14:57 IST)

కర్రను మైకుగా మార్చుకుంది.. చిన్నారి పాత్రికేయురాలుగా అదరగొట్టింది..

సోషల్ మీడియాలో ఓ చిన్నారి పాత్రికేయురాలి వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. హర్యానాలో ఓ చిన్నారి చేసిన రిపోర్టింగ్ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా మధ్యప్రదేశ్‌లోని కురుక్షేత్ర సహా కొన్ని ప్రాంతాల్లో వరద నీరు నిలిచిపోయింది. దీంతో ప్రజలు నడిచేందుకు తెగ ఇబ్బంది పడుతున్నారు.
 
నివాస ప్రాంతాల్లోకి వరద నీరు చేరడంతో ప్రజలు నానా తంటాలు పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఓ చిన్నారి వరదలతో ఏర్పడిన ఇబ్బందులను చెప్పుకొచ్చింది. కర్రను మైక్‌లా పట్టుకుని హిందీలో ఎడపెడా మాట్లాడేసింది. 
 
నీరు చాలా వేగంగా ప్రవహిస్తుందని.. ఓ ఇంటిని చూపిస్తూ అది నీటితో నిండిపోయిందని చెప్పుకొచ్చింది. నీటితో దారులన్నీ కనిపించట్లేదని.. నడిచేందుకు చాలా ఇబ్బందులు పడుతున్నట్లు వెల్లడించింది. ఓ చిన్నారి రిపోర్టర్ అవతారం ఎత్తిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.