శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 2 జులై 2024 (22:41 IST)

భోలే బాబా ఎవరు... సామాజిక మాధ్యమాలకు దూరంగా వుంటారట!

Bhole Baba
Bhole Baba
భోలే బాబా పేరు ప్రస్తుతం దేశం మొత్తం మారుమోగుతోంది. ఈయన సత్సంగంలో పాల్గొన్న కారణంగా తొక్కిసలాటకు గురై 100 మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఈ బాబా ఎవరని చాలామంది నెట్టింట వెతికేస్తున్నారు. 
 
భోలే బాబా ఎవరంటే.. మోడ్రన్ బాబాల మాదిరిగా కాకుండా బోలో బాబా సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉంటారు. ఎటా జిల్లా పాటియాలి తహసల్‌కు చెందిన బహదూర్ గ్రామానికి చెందిన భోలే బాబా గతంలో ఇంటెలిజెన్స్ బ్యూరో ఉద్యోగిగా పనిచేశారట.
 
26 ఏళ్ల క్రితమే ఆయన ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి మతపరమైన సత్యంగాలు ప్రారంభించారు. ఆయనకు దేశవ్యాప్తంగా లక్షలాది మంది ఫాలోవర్స్ ఉన్నారు.  
 
భోలే బాబా సత్సంగ కార్యక్రమాలు ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లో ప్రతి మంగళవారం నిర్వహిస్తుంటారు. దీనికి వేలాది మంది భక్తులు హాజరవుతుంటారు. భక్తులకు అవసరమైన ఆహార, నీటి వసతులను వలంటీర్లే స్వయంగా ఏర్పాటు చేస్తుంటారు.