గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By జె
Last Modified: బుధవారం, 29 జులై 2020 (20:18 IST)

నీళ్ళలో తేలియాడిన కార్లు, స్కూటర్లు..ఎక్కడ..?

తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు పడ్డాయి. సరిగ్గా 1954 సంవత్సరంలో ఈ సీజన్లో 230 మిల్లీ మీటర్ల వర్షం తమిళనాడులో నమోదైతే ఆ రికార్డును బద్దలు కొడుతూ 280 మిల్లీ మీటర్ల వర్షం తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా కురిశాయి. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయైపోయాయి. ముఖ్యంగా చెన్నై నగరం వర్షపు నీటితో నిండిపోయింది.
 
చెన్నైలోని మౌంట్ రోడ్డు, టి.నగర్, మెరీనాబీచ్ రోడ్డులలో నాలుగున్నర అడుగుల మేర వర్షపు నీరు నిలిచిపోయింది. కార్లు వర్షపు నీటిలో తేలియాడాయి. ఇక స్కూటర్లు పూర్తిగా మునిగిపోయాయి. ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిందిపోయింది. నిన్న సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి వరకూ వర్షం పడుతూనే ఉంది.
 
దీంతో ఉదయాన్నే రోడ్లన్నీ వర్షపు నీటితో నిండిపోయాయి. రోడ్లు చెరువులను తలపిస్తే.. చెరువులన్నీ సముద్రాలను తలపించాయి. ముఖ్యంగా కులాల్ చెరువు అయితే సముద్రాన్ని తలపించింది. ఈదురుగాలులకు నీళ్ళు అటూ ఇటూ తిరుగుతూ సముద్రాన్ని తలపించింది. 
 
మీనంబాక్కం ఎయిర్ పోర్ట్ రోడ్డులో వర్షపు నీరు అలాగే నిలిచిపోయింది. దీంతో కోవిడ్ బాధితులకు సేవ చేసే వారియర్స్  ఇబ్బందులు పడాల్సి వచ్చింది. విధులకు చాలామంది ఆలస్యంగా హాజరైతే విధులు ముగించుకున్న వారు మాత్రం తిరిగి ఇళ్ళకు చేరుకోవడానికి చాలా సమయం పట్టింది. తమిళనాడు రాష్ట్రంలోని తేనె, తిరుచ్చి, తంజావూరు, సేలంలో భారీ వర్షాలు నమోదయ్యాయి.