ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 13 డిశెంబరు 2022 (17:48 IST)

ఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయం...ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన హిమాన్షు

Himanshu
దేశ రాజకీయాలను ప్రభావితం చేసేందుకు సీఎం కేసీఆర్ భారత రాష్ట్ర సమితి అనే జాతీయ పార్టీని స్థాపించారు. అలాగే శరవేగంగా కేంద్ర కార్యాలయం ఏర్పాటు చేస్తున్నారు. ఈ నెల 14న ఢిల్లీలోని సర్దార్‌ పటేల్‌ రోడ్డులో బీఆర్‌ఎస్‌ కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు.
 
ఫలితంగా ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. సీఎం కేసీఆర్ మనవడు హిమాన్షు.. పార్టీ కేంద్ర కార్యాలయంలో గుర్తింపు తెచ్చుకుని అక్కడ అందరి దృష్టినీ ఆకర్షించాడు. విమానాశ్రయం నుంచి సీఎం తన అధికారిక నివాసానికి చేరుకున్నట్లు సమాచారం. పార్టీ ప్రధాన కార్యాలయ భవన నిర్మాణంపై ఎంపీలతో చర్చించారు.