సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 11 ఏప్రియల్ 2020 (09:56 IST)

ట్రిబుల్ బెడ్రూం చుట్టూ 14 కి.మీ, పరుగెడుతున్న మారథాన్.. ఎలా?

ప్రపంచం స్తంభించిపోయింది. ఇందులో మన దేశం కూడా ఉంది. కరోనా వైరస్ బారినుంచి తప్పించుకునేందుకు కేంద్రం దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ అమలు చేస్తోంది. దీంత ప్రతి ఒక్కరూ తమతమ ఇళ్ళకే పరిమితమయ్యారు. అత్యవసర సేవలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. చివరకు పార్కులు, స్టేడియాలను కూడా మూసివేశారు. దీంతో వాకింగ్ చేసేవారితో పాటు మారథానర్స్ (రన్నర్స్) తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 
 
అయితే, ముంబైలో ది ప్యూరియస్ రన్నింగ్ కల్చరల్ ఫౌండేషన్ ఉంది. ఇందులో వషి, ఖరగ్‌పూర్, ఉల్వే, బెలాపూర్, నెరుల్ తదిత ప్రాంతాలకు చెందిన వారంతా సుమారు 50 మంది వరకు సభ్యులు ఉన్నారు. వీరంతా రన్నర్స్. అయితే, లాక్‌డౌన్ కారణంగా కాలు బయటపెట్టేందుకు వీలులేదు. దీంతో వారికి ఓ కొత్త ఆలోచన వచ్చింది. అంతే.. మారథానర్స్ ఆన్‌లైన్ రన్నింగ్ ఛాలెంజ్ పెట్టుకున్నారు. 
 
ఇంటిలోప‌లే క్వారంటైన్ స‌మ‌యాన్ని ఫిట్‌గా ఉండేందుకు ఎలా ఉప‌యోగించాలో చెబుతూ ఈ ఛాలెంజ్‌లో చాలా మంది పాల్గొన్నారు. న‌వీ ముంబైలోని ది ప్యూరియ‌స్ ర‌న్నింగ్ కల్చ‌ర‌ల్ ఫౌండేష‌న్ లో 150 మంది స‌భ్యులున్నారు. వారంతా ప్ర‌తీ రోజు వాట్సాప్, ఫేస్‌బుక్ గ్రాప్‌ల‌లో ఒకరికొక‌రు ఛాలెంజ్ విసురుకుంటారు.
 
స‌భ్యులంతా ఎవ‌రి అపార్టుమెంట్‌, ఇంటి వ‌ద్ద వారు నాలుగు గోడ‌ల మ‌ధ్య వీక్ డేస్‌లో షార్ట్ ర‌న్ (త‌క్కువ స‌మ‌యం ప‌రుగు), వీకెండ్‌లో లాంగ్ ర‌న్‌ను ప్లాన్ చేసుకుని క్వారంటైన్ స‌మయాన్ని ఎంజాయ్ చేస్తూ.. ఫిట్‌గా ఉండేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఇందులోని ఓ సభ్యుడు... నేను ప్రతి రోజూ నా ట్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ చుట్టూ 14 కిలోమీట‌ర్లు ప‌రుగెత్తుతున్నాన‌ని చెప్పుకొచ్చాడు.