మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : గురువారం, 8 ఆగస్టు 2019 (13:20 IST)

విధ్వంసానికి ఉగ్రమూకల కుట్ర - దేశ వ్యాప్తంగా హైఅలెర్ట్

జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో అమలు చేస్తూ వచ్చిన 370 అధికరణను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఈ చర్యను పాకిస్థాన్‌తో పాటు పాక్ ప్రేరేపిత ఉగ్రమూకలు ఏమాత్రం జీర్ణించుకోలేక పోతున్నాయి. దాడులతో విధ్వంసం సృష్టించాలని కుట్ర పన్నినట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో దేశ వ్యాప్తంగా హైఅలెర్ట్‌ను కేంద్రం ప్రకటించింది.
 
దేశంలో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో అన్ని అంతర్జాతీయ విమానాశ్రయంలో విస్తృతంగా తనిఖీలు జరుగుతున్నాయి. జమ్మూకాశ్మీరులో ప్రతి కిలోమీటరుకి ఒక సీఆర్పీఎఫ్ క్యాంపును ఏర్పాటు చేశారు. అలాగే, దేశవ్యాప్తంగా సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా పెట్టారు. 
 
అన్ని రాష్ట్రాల పోలీసులు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇవ్వాలని కేంద్రం ఆదేశించింది. కాశ్మీరు అంశంపై భారత్ తీసుకున్న నిర్ణయంతో రగిలిపోతున్న ఉగ్రవాదులు దాడులకు తెగబడేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారని పేర్కొంది. 
 
ఈ ఉగ్రమూకలు సామాన్య ప్రజానికమే లక్ష్యంగా విరుచుకుపడేలా ఉగ్ర సంస్థలు జైషే మొహమ్మద్, లష్కరే తోయిబాలు కుట్రపన్నాయి. దీంతో ఢిల్లీ ,రాజస్థాన్, పంజాబ్, గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు హెచ్చరికలు జారీచేశారు.