బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr

జైట్లీకి యశ్వంత్ కౌంటర్.. నేను కావాలనుకుంటే నువ్వు అక్కడ ఉండవు...

దేశ ఆర్థిక వ్యవస్థపై సంచలన వ్యాఖ్యలు చేసిన బీజీపీ సీనియర్ నేత, కేంద్ర ఆర్థిక మాజీ మంత్రి యశ్వంత్ సిన్హాపై ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ విమర్శలు దాడి చేశారు. 80 యేడ్ల వయస్సులో ఉద్యోగానికి దరఖాస్తు చేసుకుం

దేశ ఆర్థిక వ్యవస్థపై సంచలన వ్యాఖ్యలు చేసిన బీజీపీ సీనియర్ నేత, కేంద్ర ఆర్థిక మాజీ మంత్రి యశ్వంత్ సిన్హాపై ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ విమర్శలు దాడి చేశారు. 80 యేడ్ల వయస్సులో ఉద్యోగానికి దరఖాస్తు చేసుకుంటున్నారని జైట్లీ వ్యాఖ్యానించారు. ఈ విమర్శలకు యశ్వంత్ సిన్హా సరైన రీతిలో కౌంటర్ ఇచ్చారు. 
 
తన వయస్సు 80 యేళ్లని, ఈ వయస్సులో తనకు ఉద్యోగం అవసరం లేదన్నారు. ఒకవేళ తాను ఉద్యోగం కావాలనుకుంటే కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ నిరుద్యోగిగా మారుతారని, ఆయన అక్కడ(మంత్రి హోదాలో) ఉండరని చెప్పారు. ఈ వయస్సులో తనకు ఉద్యోగం అవసరం లేదని చెప్పారు. కిందిస్థాయి నుంచి ఎదగని వ్యక్తులు అలాగే మాట్లాడుతారని, ప్రజల చేత ఎన్నికైన వ్యక్తి అయితే అలా మాట్లాడరన్నారు. 
 
కాగా, యశ్వంత్‌ సిన్హాకు మరో బీజేపీ ఎంపీ శత్రుఘ్నసిన్హా మద్దతు తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థ గురించి ఏదో ఒక రోజు ప్రజలు ప్రధానిని నిలదీస్తారని అప్పుడు ఆయన సమాధానం చెప్పక తప్పదన్నారు. దేశ ఆర్థిక పరిస్థితిని విశ్లేషిస్తూ యశ్వంత్ సిన్హా వ్యాసం రాశారని, ఆయనకు తాము మద్దతుగా ఉన్నామని చెప్పారు. ప్రజల విమర్శలకు ప్రధాని సమాధానం ఇవ్వాల్సిందేనన్నారు.