1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 11 సెప్టెంబరు 2023 (17:43 IST)

చంద్రబాబు అరెస్టును ఖండించిన వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ

mamata benargi
స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుని ఏపీ సీఐడీ పోలీసులు అరెక్టు చేసిన తీరును వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఖండించారు. ఆయనను అరెస్టు చేసిన తీరు ఏమాత్రం బాగోలేదన్నారు. చంద్రబాబు అరెస్టు ఓ కక్ష సాధింపులా ఉందన్నారు. ఏదైనా తప్పు జరిగితే విచారణ జరిపించాలని సూచించారు. కక్షపూరితంగా ప్రవర్తించరాదన్నారు. 
 
చంద్రబాబు అరెస్టుపై స్పందిస్తూ, చంద్రబాబు అరెస్టు కక్షసాధింపు చర్యలా ఉందన్నారు. చంద్రబాబును అరెస్టు చేసిన తీరు సరికాదన్నారు. టీడీపీ హయాంలో ఏదైనా తప్పు జరిగితే మాట్లాలని, పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలన్నారు. కానీ, కక్షపూరితంగా ప్రవర్తించడం సరికాదన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబును శనివారం అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచి రాజమండ్రి జైలుకు తరలించిన విషయం తెల్సిందే.
 
చంద్రబాబు అరెస్టు.. రాజమండ్రి సెంట్రల్ జైలులో ఖైదీ నంబర్ 7691...  
 
స్కిల్ డెవలప్‌మెంట్ అవినీతి కేసులో అరెస్టు అయిన టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేయగా, ఆయనకు ఏసీబీ కోర్టు ఈ నెల 22వ తేదీ వరకు రిమాండ్ విధించింది. దీంతో ఆయన్ను ఆదివారం అర్థరాత్రి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించగా, అక్కడ ఆయనకు ఖైదీ నంబర్ 7691ను కేటాయించారు. 
 
ఏసీబీ కోర్టు చంద్రబాబుకు రిమాండ్ విధించడంతోనే ఆయనను ప్రత్యేక బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో కాన్వాయ్ వెంట రాగా ఆయనను పోలీసులు జైలుకు తరలించారు. ఈ సందర్భంగా ఎన్ఎస్ఓ భద్రతా సిబ్బంది కూడా ఆయనను అనుసరించారు. మార్గమధ్యంలో ఓ వాహనం బ్రేక్ డౌన్ కాగా దాన్ని పక్కన పెట్టేశారు. విజయవాడ నుంచి రాజమహేంద్రవరం వరకూ చంద్రబాబు ప్రయాణించే మార్గంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
 
ఆదివారం అర్థరాత్రి చంద్రబాబు కాన్వాయ్ జైలుకు చేరుకుంది. అధికారిక లాంఛనాలు పూర్తి చేసిన అనంతరం పోలీసులు ఆయనను జైలు అధికారులకు అప్పగించారు. జైల్లో అధికారులు చంద్రబాబుకు ప్రత్యేక గది కేటాయించడంతో పాటూ కోర్టు ఆదేశాల మేరకు ప్రత్యేకంగా ఆహారం, అవసరమైన మందులు ఇతర వసతులు కల్పించేందుకు ఏర్పాట్లు చేశారు. 
 
చంద్రబాబు మాజీ ముఖ్యమంత్రి అయినందున ఖైదీ దుస్తులకు బదులు సాధారణ దుస్తులు ధరించేందుకు అనుమతించారు. అప్పటివరకూ చంద్రబాబు వెంట వచ్చిన ఆయన తనయుడు లోకేశ్ అధికారుల అనుమతితో జైల్లో కాసేపు చంద్రబాబుతో మాట్లాడి వచ్చేశారు.