సోమవారం, 13 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 9 డిశెంబరు 2024 (13:44 IST)

Hindutva A Disease హిందుత్వ అనేది ఒక జబ్బు : ముఫ్తీ కుమార్తె ఇల్తీజా

Iltija Mufti
Hindutva A Disease హిందుత్వ అనేది ఒక జబ్బుగా మారిపోయిందని జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ అధ్యక్షురాలు మహబూబా ముఫ్తీ కుమార్తె ఇల్తీజా ముఫ్తా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేయాలని ముగ్గురు ముస్లిం బాలురపై దాడి చేశారు. ఈ దాడికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై ఆమె స్పందించారు.
 
'హిందుత్వ అనేది ఒక జబ్బు' అంటూ ఎక్స్ ఓ వీడియోను షేర్ చేశారు. ఆ వీడియో ఓ కుర్రాడు.. 'జై శ్రీరామ్' అని చెప్పాలంటూ ముగ్గురు ముస్లిం బాలురను చెప్పుతో దారుణంగా కొడుతున్నాడు. 'అల్లా' అంటావా అంటూ చెప్పుతో చెంపలు వాయించాడు. వారు ఏడుస్తున్నా వదలకుండా చెప్పుతో వారిని ఎడాపెడా వాయిస్తూనే ఉన్నాడు. వారు భయంతో 'జైశ్రీరామ్' అని అంటున్నా వదలకుండా కొడుతూనే ఉన్నాడు.
 
ఈ వీడియోను షేర్ చేసిన ఇల్తీజా.. తన పేరు జపించేందుకు నిరాకరించిన ముస్లిం బాలురను చెప్పుతో కొడుతుండడాన్ని చూసి రాముడు సిగ్గుతో తలవంచుకుని నిస్సహాయంగా చూడాలని రాసుకొచ్చారు. హిందుత్వ అనేది ఒక జబ్బులాంటిదని, దేవుడి పేరుతో కోట్లమంది భారతీయులపై ప్రభావం చూపుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. 
 
కాగా, గతంలో తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. సనాతన ధర్మం డెంగీ, మలేరియా లాంటిదని, దానిని నిర్మూలించాలని చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపాయి.