శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 27 డిశెంబరు 2017 (09:10 IST)

జైహింద్: జనగణమన… తొలిసారి పాడింది ఈరోజే

జాతీయ గీతం.. జనగణమన… విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన ఈ గీతాన్ని మొదటిసారి ఆలపించింది డిసెంబర్ 27వ తేదీనే. కలకత్తా కాంగ్రెస్ మహాసభల్లో 1911 డిసెంబర్ 27వ తేదీన ఈ గీతాన్ని పాడారు.

జాతీయ గీతం.. జనగణమన… విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన ఈ గీతాన్ని మొదటిసారి ఆలపించింది డిసెంబర్ 27వ తేదీనే. కలకత్తా కాంగ్రెస్ మహాసభల్లో 1911 డిసెంబర్ 27వ తేదీన ఈ గీతాన్ని పాడారు. 
 
బెంగాలీ జనగణమన గీతంలో మొదటి భాగాన్ని తొలిసారి మనరాష్ట్రంలోని మదనపల్లె బిసెంట్ థియోసాఫికల్ కాలేజ్‌లో ఠాగూర్ పాడి వినిపించారు. ఈ గీతానికి బాణీలు కట్టింది కూడా విశ్వకవే. ప్రపంచంలో అత్యుత్తమ జాతీయ గీతంగా యునెస్కో జనగణమనను గుర్తించిన విషయం తెల్సిందే. 
 
జనగణమన అధినాయక జయహే!
భారత భాగ్య విధాతా!
పంజాబ, సింధు, గుజరాత, మరాఠా!
ద్రావిడ, ఉత్కళ, వంగ!
వింధ్య, హిమాచల, యమునా, గంగ!
ఉచ్చల జలధితరంగ!
తవశుభనామే జాగే! తవ శుభ ఆశిష మాగే!
గాహే తవ జయగాథా!
జనగణమంగళ దాయక జయహే!
భారత భాగ్య విధాతా!
జయహే! జయహే! జయహే!
జయ జయ జయ జయహే!
 
తాత్పర్యం : ప్రజలందరి మనస్సుకూ అధినేతవు, భారత భాగ్య విధాతవు అయిన నీకు జయమగు గాక. పంజాబ్, సింధు, గుజరాత్, మహారాష్ట్ర, ద్రావిడ, ఉత్కళ, వంగ దేశాలతోను, వింధ్య, హిమాలయ పర్వతాలతోను, యమునా, గంగా ప్రవాహాలతో ఉవ్వెత్తున లేచే సముద్ర తరంగాలతోను శోభించే ఓ భాగ్య విధాతా! వాటికి నీ శుభనామం ఉద్బోధ కలిగిస్తుంది. అవి నీ ఆశీస్సులను ఆకాంక్షిస్తాయి. నీ జయ గాథల్ని గానం చేస్తాయి. సకల జనులకు మంగళకారివి. భారత భాగ్య విధాతవూ అయిన నీకు జయమగుగాక! జయమగుగాక! జయమగుగాక!.