శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 13 ఫిబ్రవరి 2020 (13:44 IST)

సరిసంఖ్య వున్న రోజును డేటింగ్ చేస్తే మగపిల్లాడు పుడతాడట..

Indurikar Maharaj
సరిసంఖ్య వున్న రోజును డేటింగ్ చేస్తే.. మగపిల్లాడు పుడతాడనీ, అదే బేసి సంఖ్య వున్న రోజున సెక్స్ లేదా డేటింగ్ చేస్తే ఆడపిల్ల పుడుతుందని ప్రముఖ మరాఠా బోధకుడు ఇందూరికర్ మహారాజ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అహ్మద్‌నగర్ జిల్లాలో చేసిన ఈ వివాదాస్పద వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపుతున్నాయి. సోషల్ మీడియాలో దీనిపై చర్చ జరుగుతోంది. 
 
బోధకుడైన ఇందూరికర్ చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు. మరికొందరు ఆయన అలా ఎందుకన్నారోనని చెప్తున్నారు. అందులో నిజం ఉందేమో అని మరికొందరు ఆలోచిస్తున్నారు. ఇందూరికర్ మహరాజ్ మరో డైలాగ్ కూడా అన్నారు. 
 
శుభ సమయంలో సెక్స్ చేస్తే.... మంచి బిడ్డ పుడతారనీ అదే చెడు సమయంలో సెక్స్ చేస్తే... పుట్టే బిడ్డ ఆ కుటుంబానికి చెడ్డపేరు తెస్తారని కూడా అన్నారు. ఇదివరకు కూడా ఇందూరికర్ మహరాజ్ ఇలాంటి చాలా వింత కామెంట్లు చేశారు. 
 
వాటి సంగతెలా ఉన్నా తాజా కామెంట్లపై మాత్రం మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులు స్పందించారు. ఈ వ్యాఖ్యలు ప్రీ-కన్సెప్షన్ అండ్ ప్రి-నాటల్ డయాగ్నోస్టిక్ టెక్నిక్స్ యాక్ట్‌కి వ్యతిరేకంగా ఉన్నాయన్న అధికారులు తగిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.