వేరుశెనగల్లో కరెన్సీ నోట్లు... విలువెంతో తెలుసా? రూ.45లక్షలు!

Peanut
Peanut
సెల్వి| Last Updated: బుధవారం, 12 ఫిబ్రవరి 2020 (17:45 IST)

దేశ రాజధాని నగరం ఢిల్లీ విమానాశ్రయంలో కొత్త పద్ధతిలో కరెన్సీ తరలింపును అధికారులు కనుగొన్నారు. విదేశాల నుంచి కొత్త టెక్నిక్‌తో భారత్‌కు తరలించిన ఫారిన్ కరెన్సీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఫారిన్ నుంచి వచ్చిన ప్రయాణీకుల వద్ద అధికారులు తనిఖీలు నిర్వహించారు.

ఆ సమయంలో ఓ ప్యాసింజర్ తెచ్చిన ఆహార పదార్థంపై అధికారులకు అనుమానం కలిగింది. ఈ క్రమంలో జరిగిన సోదాల్లో పోలీసులకు షాకయ్యే నిజం తెలిసింది. వేరుశెనగల్లో కరెన్సీ నోట్లను దాచిన నిజాన్ని పోలీసులు కనుగొన్నారు. ఆపై ఆ కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ నగదు భారత కరెన్సీ విలువ రూ. 45లక్షలని తెలిసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.దీనిపై మరింత చదవండి :