గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 22 మే 2023 (12:47 IST)

జూలైలో చంద్రయాన్ - ఇస్రో సీనియర్ అధికారి వెల్లడి

Chandrayan 2
ఫోటో కర్టెసీ-ఇస్రో
చంద్రుడిపై అధ్యయనానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన ప్రతిష్టాత్మక ప్రాజెక్టు చంద్రయాన్. ఈ ప్రాజెక్టులో భాగంగా చంద్రయాన్-3ని జూలైలో ప్రయోగించేందుకు సిద్ధమవుతుంది. ఇది చంద్రుడిపై అధ్యయనం కోసం ఇస్రో ప్రయోగించే మూడో మిషన్. 2019లో చంద్రయాన్-2 ప్రయోగం చేపట్టగా ఆది విఫలమైన విషయం తెల్సిందే.

ఈసారి అలాంటి పరిస్థితులు తలెత్తకుండా పకడ్బందీగా సన్నాహాలు చేస్తోంది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం (షార్) నుంచి జూలై మొదటి లేదా రెండో వారంలో ప్రయోగం చేపడతామని, తేదీ ఇంకా ఖరారు కాలేదని ఇస్రో సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.

ఈ ప్రయోగానికి బాహుబలి రాకెట్ లాంచ్ వెహికిల్ మార్క్ (ఎల్వీఎం)-3 (జీఎస్ఎల్వీ మార్క్-3)ని ఉపయోగించనున్నారు.బెంగుళూరులోని యాఆర్ రావు శాటిలైట్ సెంటరులో దీని పేలోడ్లు అసెంబ్లింగ్‌లో ఇస్రో బిజీగా ఉంది. ఈ పేలోడ్ల చివరి దశ పరీక్షలు విజయవంతంగా పూర్తయ్యాయి. ఈ వ్యోమనౌకలో ప్రొపల్షన్, ల్యాండర్, రోవర్‌తో కూడిన మూడు వ్యవస్థలు ఏర్పాటుచేశారు.

ల్యాండర్ సాయంతో దీన్ని చంద్రునిపై దింపనున్నారు. ఆ తర్వాత రోవర్.. చంద్రునిపై కలియ తిరుగుతూ విలువైన సమాచారం సేకరిస్తుంది. చంద్రుడి రిగోలిత్ థర్మో ఫిజికల్ లక్షణాలు, కంపనలు, ఉపరితల వాతావరణాన్ని పరిశీలించేందుకు ఉపయోగపడుతుందని సీనియర్ అధికారి వెల్లడించారు.