బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 1 అక్టోబరు 2024 (08:15 IST)

జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు : నేడు చివరి దశ పోలింగ్

polling
జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా మంగళవారం చివరి దశ పోలింగ్ జరుగనుంది. ఇప్పటికే రెండు విడదల పోలింగ్ ప్రశాంతంగా ముగియగా, మూడో దశ పోలింగ్ ఉదయం నుంచి ప్రారంభమైంది. జమ్మూ ప్రాంతంలో 24, కాశ్మీర్‌ లోయలో 16 కలిపి మొత్తం 40 స్థానాల్లో బరిలో ఉన్న 415 మంది అభ్యర్థుల భవితను 39.18 లక్షల మంది ఓటర్లు తేల్చనున్నారు. 5,060 పోలింగ్‌ కేంద్రాల్లో దాదాపు 20 వేల మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. 370 రాజ్యాంగ అధికరణం రద్దయిన తర్వాత ఓటుహక్కు పొందిన పశ్చిమ పాకిస్థాన్‌ శరణార్థులు, వాల్మీకి సమాజ్, గూర్ఖా తెగలవారు ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేయబోతున్నారు.
 
కాగా, చివరి దశ పోలింగ్ నేపథ్యంలపో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ, ఇప్పటివరకు మొత్తం 50 నియోజకవర్గాల్లో నిర్వహించిన ఎన్నికల్లో 17 స్థానాలతో పోల్చుకుంటే మహిళల ఓటింగ్ శాతం అధికంగా ఉందని తెలిపారు. ఈ నెల 8వ తేదీన ఓట్ల లెక్కింపు చేపడుతామని చెప్పారు.  ఈ ప్రక్రియలో భాగంగా ప్రతి రౌండ్ కౌంటింగ్ తర్వాత ప్రతి అభ్యర్థికి పోల్ అయిన ఓట్ల వివరాలను తెలియజేస్తామని తెలిపారు. 
 
కౌంటింగ్ విధానంపై జరుగుతున్న తప్పుడు సమాచారాన్ని ప్రజలు నమ్మవద్దని అన్నారు. మంగళవారం జరుగుతున్న 40 స్థానాలకు 415 మంది అభ్యర్ధులు పోటీ పడుతున్నారు. 2060 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరుగుతుండగా, 20వేల మందికిపైగా పోలింగ్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు గానూ భారీ ఎత్తున పోలీస్ బందోబస్తు చర్యలు చేపట్టారు. 
 
ఈ తుది దశ పోలింగ్‌లో మాజీ ఉప ముఖ్యమంత్రులు తారా చంద్, ముజఫర్ బేగ్ పోటీలో ఉన్నారు. పశ్చిమ పాకిస్థాన్ శరణార్ధులు, వాల్మీకి సమాజానికి చెందిన వారు, గుర్ఖా సామాజికవర్గానికి చెందిన వారు ఈ ఎన్నికల్లో అత్యధిక ఓటర్లుగా ఉన్నారు. పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభం కాగా, సాయంత్రం 6 గంటలకు వరకు జరగనుంది.