'అమ్మ' సమాధి సాక్షిగా ఆగిన గుండె.. చూస్తుండగానే తుదిశ్వాస విడిచాడు
తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి దివంగత జయలలిత మహాసమాధి సాక్షిగా ఓ అన్నాడీఎంకే కార్యకర్త గుండె ఆగిపోయింది. చెన్నై మెరీనా తీరంలో జయలలితకు అంత్యక్రియలు పూర్తి చేసిన విషయం తెల్సిందే. నాటి నుంచ
తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి దివంగత జయలలిత మహాసమాధి సాక్షిగా ఓ అన్నాడీఎంకే కార్యకర్త గుండె ఆగిపోయింది. చెన్నై మెరీనా తీరంలో జయలలితకు అంత్యక్రియలు పూర్తి చేసిన విషయం తెల్సిందే. నాటి నుంచి అమ్మ సమాధాని చూసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా జయలలిత అభిమానులు, పార్టీ కార్యకర్తలు తండోపతండాలుగా తరలివస్తున్నారు.
ఇలా మహాసమాధిని చూసేందుకు తిరుచ్చి నుంచి వచ్చిన ఓ కార్యకర్త గుండె 'అమ్మ' సమాధి వద్దే ఆగిపోయింది. అన్నాడీఎంకే రైతు విభాగం రాష్ట్ర కోశాధికారి తంగవేలు నేతృత్వంలో జయలలిత మహాసమాధిని చూసేందుకు శనివారం పలువురు కార్యకర్తలు వచ్చారు. సమాధి వద్దకు వెళ్లేందుకు వారంతా క్యూలో నిలుచుని ఉండగా, అకస్మాత్తుగా తంగవేలు గుండెపోటుతో కుప్పకూలాడు. వెంటనే ఆయనను రాయపేట ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. దీంతో ఆయన మృతదేహాన్ని తిరుచ్చికి తీసుకెళ్లారు.