మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 6 ఆగస్టు 2019 (17:30 IST)

జేఎన్‌యూ విద్యార్థినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారం.. 3 గంటల పాటు నరకం చూపాడు..

ఢిల్లీలో జేఎన్‌యూ విద్యార్థిని పట్ల క్యాబ్ డ్రైవర్ అకృత్యానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. శుక్రవారం రాత్రి స్నేహితుడి పుట్టిన రోజు పార్టీకి వెళ్లింది. పార్టీ ముగిశాక ఇంటికి వెళ్లేందుకు క్యాబ్ బుక్ చేసుకుంది. కొంత దూరం వెళ్లాక ఆ యువతి పట్ల డ్రైవర్ అసభ్యంగా ప్రవర్తించాడు. బలవంతంగా డ్రగ్స్ ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడు.
 
నగర రోడ్లపై కారును తిప్పుతూ మూడు గంటల పాటు నరకం చూపించాడు. అనంతరం ఢిల్లీ ఐఐటీ క్యాంపస్ పరిసరాల్లో వదిలిపెట్టి అక్కడి నుంచి పారిపోయాడు. రోడ్డు పక్కన అపస్మారక స్థితిలో పడిఉన్న యువతిని స్థానికులు గుర్తించి సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. కాస్త కోలుకున్న తర్వాత జేఎన్‌యూ క్యాంపస్‌కు వెళ్లి జరిగిన విషయాన్ని హాస్టల్ వార్డెన్, స్నేహితులకు వివరించింది. 
 
అనంతరం వసంత్ కుంజ్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఐతే ఆ యువతి మందిర్ మార్గ్ ప్రాంతంలో క్యాబ్ బుక్ చేసినట్లుగా గుర్తించిన పోలీసులు...అక్కడి పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.