శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By
Last Updated : బుధవారం, 24 జులై 2019 (15:13 IST)

దేశవ్యాప్తంగా 23 నకిలీ యూనివర్శిటీలు... అవేంటో తెలుసా?

దేశవ్యాప్తంగా నకిలీ విశ్వవిద్యాలయాల జాబితాను యూనివర్శిటీ గ్రాంట్ కమిషన్ (యూజీసీ) తాజాగా విడుదల చేసింది. సాధారణంగా దేశంలో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చట్టం 1956లోని సెక్షన్ 22(1) ప్రకారమే ఒక యూనివర్శిటీని ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఉంది. లేదా, యూజీసీ చట్టంలోని సెక్షన్ 3 ప్రకారం డీమ్డ్ యూనివర్సిటీ లేదా పార్లమెంట్‌లోని చట్టం ప్రకారం మాత్రమే విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేయాల్సి వుంది. ఈ యూనివర్శిటీలు ఇచ్చే డిగ్రీలు మాత్రమే చెల్లుబాటవుతాయి. 
 
అయితే, ఇటీవలి కాలంలో దేశ వ్యాప్తంగా కుప్పలుతెప్పలుగా అనేక విశ్వవిద్యాలయాలు పుట్టుకొస్తున్నాయి. వీటిలో ఏది నిజమైనదో, ఏది నకిలీదో తెలియక అనేక మంది విద్యార్థులు మోసపోతున్నారు. నకిలీ విశ్వవిద్యాలయాల్లో అడ్మిషన్లు తీసుకొని విలువైన సమయాన్ని, డబ్బును వృథా చేసుకుంటున్నారు. అందుకే నకిలీ విశ్వవిద్యాలయాలను ఏరిపారేసేందుకు యూనివర్సిటీ గ్రాండ్స్ కమిషన్ రంగంలోకి దిగింది. ఇందులోభాగంగా, దేశ వ్యాప్తంగా 23 నకిలీ విశ్వవిద్యాలయాలు ఉన్నట్టు వెల్లడించింది. 
 
ఈ మొత్తం విశ్వవిద్యాలయాల్లో అత్యధికంగా ఉత్తర్‌ప్రదేశ్‌లో ఎనిమిది, ఢిల్లీలో 7, వెస్ట్ బెంగాల్‍‌లో 2, ఒడిషాలో 2, కేరళ, కర్నాటక, మహారాష్ట్ర, పుదుచ్చెరీలో ఒక్కొక్కటి చొప్పున నకిలీ యూనివర్శిటీలు ఉన్నట్టు వెల్లడించింది. ఆ నకిలీ యూనివర్శిటీల జాబితా ఇదే.. 
 
1. కమర్షియల్ యూనివర్సిటీ లిమిటెడ్, దార్యాగంజ్, ఢిల్లీ.
2. యూనైటెడ్ నేషన్స్ యూనివర్సిటీ, ఢిల్లీ.
3. ఒకేషనల్ యూనివర్సిటీ, ఢిల్లీ.
4. ఏడీఆర్ సెంట్రిక్ జ్యురిడీషియల్ యూనివర్సిటీ, న్యూఢిల్లీ.
5. ఇండియన్ ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, న్యూ ఢిల్లీ.
6. విశ్వకర్మ ఓపెన్ యూనివర్సిటీ ఫర్ సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్, న్యూ ఢిల్లీ.
7. ఆధ్యాత్మిక్ విశ్వవిద్యాలయ (స్పిరిచ్యువల్ యూనివర్సిటీ), న్యూ ఢిల్లీ.
8. బడాగన్వి సర్కార్ వాల్డ్ ఓపెన్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ సొసైటీ, బెల్గామ్, కర్నాటక.
9. సెంయిట్ జాన్స్ యూనివర్సిటీ, కిషనట్టం, కేరళ.
10. రాజా అరబిక్ యూనివర్సిటీ, నాగ్‌పూర్, మహారాష్ట్ర.
11. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్‌నేటీవ్ మెడిసిన్, కోల్‌కతా, వెస్ట్ బెంగాల్.
12. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్‌నేటీవ్ మెడిసిన్ అండ్ రీసెర్చ్, కోల్‌కతా, వెస్ట్ బెంగాల్.
13. వారణాసేయ సంస్కృత్ విశ్వవిద్యాలయ, వారణాసి, ఉత్తరప్రదేశ్.
14. మహిళా గ్రామ్ విద్యాపీఠ్ / విశ్వవిద్యాలయ, ప్రయాగ్‌రాజ్, ఉత్తరప్రదేశ్.
15. గాంధీ హిందీ విద్యాపీఠ్, ప్రయాగ్‌రాజ్, ఉత్తరప్రదేశ్.
16. నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ ఎలక్ట్రో కాంప్లెక్స్ హోమియోపతి, కాన్పూర్, ఉత్తరప్రదేశ్.
17. నేతాజీ సుభాష్ చంద్రబోస్ యూనివర్సిటీ (ఓపెన్ యూనివర్సిటీ), అలీగఢ్, ఉత్తరప్రదేశ్.
18. ఉత్తర ప్రదేశ్ విశ్వవిద్యాలయ, మథుర, ఉత్తరప్రదేశ్.
19. మహారాణ ప్రతాప్ శిక్షా నికేతన్ విశ్వవిద్యాలయ, ప్రతాప్‌గఢ్, ఉత్తరప్రదేశ్.
20. ఇంద్రప్రస్థ శిక్షా పరిషత్, నోయిడా, ఉత్తరప్రదేశ్.
21. నబభారత్ శిక్షా పరిషత్, రౌర్కెలా, ఒడిశా.
22. నార్త్ ఒడిషా యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ టెక్నాలజీ, ఒడిశా.
23. శ్రీబోధి అకాడమీ ఆఫ్ హైయ్యర్ ఎడ్యుకేషన్, పుదుచ్చేరి.