తెలుగు కవిత్వంలో ఈ శతాబ్దం నాది అని ధైర్యంగా చెప్పిన మహాకవి శ్రీశ్రీ. విప్లవ కవి. కార్మిక, కర్షక, శ్రామిక వర్గాలకు బాసటగా అణగారిన, అన్నార్తుల, బాధిత, పీడిత, తాడిత వర్గాలకు అండగా ఉన్నా, నేనున్నా, వస్తున్నానని అభయ మిచ్చి గొప్పోడి దోపిడీని, పెట్టుబడిదారీ నిరంకుశత్వ పోకడలను ఖండించేందుకు ఖడ్గ సృష్టి చేసి సమాజానికి అందించాడు.
ఎముకలు కుళ్ళిన వయస్సు మళ్ళిన సోమరులారా, చావండి. నెత్తురు మండే శక్తులు నిండే సైనికులారా, రారండి అంటూ చైతన్యాన్ని స్వాగతించాడు. పతితులార, భ్రష్టులార, బాధాతప్త దష్టులార, దగాపడ్డ తమ్ములార, ఏడవకండేడవకండి అంటూ తన మనుషుల్ని ఓదార్చాడు.
1215: ఇంగ్లాండ్ రాజు, కింగ్ జాన్, 'మాగ్నా కార్టా ' మీద తన ఆమోదం తెలుపుతూ, తన సీల్ (రాజ ముద్ర) వేసాడు.
1991: రాజీవ్ గాంధీ హత్య కేసులో, నళిని, మురుగన్ అనే ఇద్దరు అనుమానితులను అరెస్ట్ చేసారు.
1908: కలకత్తా స్టాక్ ఎక్స్‌ఛేంజ్ ఆరంభము.
1877: యునైటెడ్ స్టేట్స్ మిలిటరీ అకాడమీ నుండి నల్ల జాతికి చెందిన మొట్టమొదటి పట్టభద్రుడుగా హెన్రీ ఒస్సెయిన్ ఫ్లిప్పర్.
1844: 'ఛార్లెస్ గుడ్ ఇయర్', రుబ్బర్ ని వల్కనైజింగ్ చేసే పద్ధతికి, పేటెంట్ పొందిన రోజు.
1836: ఉత్తర అమెరికా యొక్క 25వ రాష్టంగా ఆర్కాన్సాస్ ఆవిర్భవం.
1808: 'జోసెఫ్ బోనపార్టె' స్పెయిన్ కి రాజు అయ్యాడు.
1785: ప్రపంచంలో మొట్ట మొదటి విమాన ప్రమాదం (హాట్ ఎయిర్ బెలూన్ పేలిపోవటం) ఇంగ్లీష్ ఛానెల్ దాటే ప్రయత్నంలో జరిగింది. ఆ హాట్ ఎయిర్ బెలూన్ లో ప్జీన్ ఫ్రాంకోయిస్ పిలాట్రె డి రోజీర్, కో పైలెట్, అతని సహచరుడు పియర్ రొమెయిన్ ఉన్నారు.
1775: అమెరికన్ రివల్యూషనరీ వార్ సమయంలో, 'జార్ఝి వాషింగ్టన్' ని, కాంటినెంటల్ ఆర్మీ కి, కమాండర్-ఇన్-ఛీఫ్ గా నియమించారు.
1752: వర్షం సమయాన వచ్చే సమయంలో కనిపించే మెరుపులు కరెంటు అని బెంజమిన్ ఫ్రాంక్లిన్ ఋజువు చేసాడు.
1667: డాక్టర్ జీన్ బాప్టిస్టె డెనిస్ మొట్టమొదటిసారిగా గొర్రె నుండి మనిషి (15 సం.ల బాలుడు) కి 'రక్త మార్పిడి' చేసాడు.