శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 21 సెప్టెంబరు 2018 (11:33 IST)

రాజకీయ నాయకుడితో వివాహేతర సంబంధం.. 150 సవర్ల బంగారంతో జంప్

రాజకీయ నాయకుడితో అక్రమ సంబంధం పెట్టుకున్న ఓ వ్యాపారి భార్య.. ఇంట్లోని 150 సవర్ల బంగారు నగలను దోచేసుకుని ప్రియుడితో జంప్ అయ్యింది. ఈ ఘటన తమిళనాడులోని కన్యాకుమారి సమీపంలో కలకలం రేపింది.

రాజకీయ నాయకుడితో అక్రమ సంబంధం పెట్టుకున్న ఓ వ్యాపారి భార్య.. ఇంట్లోని 150 సవర్ల బంగారు నగలను దోచేసుకుని ప్రియుడితో జంప్ అయ్యింది. ఈ ఘటన తమిళనాడులోని కన్యాకుమారి సమీపంలో కలకలం రేపింది. 
 
వివరాల్లోకి వెళితే.. మార్తాండం ప్రాంతానికి చెందిన ఓ వ్యాపారి (50) ఫైనాన్స్ కంపెనీని నిర్వహిస్తుండగా, అతనికి భార్య (40), ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. వీరింటి పక్కనే వివాహమై భార్యా, పిల్లలున్న ఓ రాజకీయ పార్టీ ప్రముఖుడు నివాసం ఉంటున్నాడు.
 
వీరిద్దరి మధ్య వ్యాపార లావాదేవీల్లో భాగంగా ఏర్పడిన పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. విషయం తెలిసిన వ్యాపారి వారిని మందలించినా ఫలితం లేకపోయింది. 
 
ఈ క్రమంలో బుధవారం నాడు తన ఇంట్లోని 150 సవర్ల బంగారం నగలతో ఆమె అదృశ్యం అయింది. తన ప్రియుడితో కలసి ఆమె పారిపోయినట్టు విచారణలో వెల్లడికాగా, వారిద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.