శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : మంగళవారం, 15 మే 2018 (18:13 IST)

కర్ణాటకలో సీఎం పీఠం కోసం రసవత్తర పోరు.. బీజేపీ, కాంగ్రెస్ పోటా పోటీ..

కర్ణాటక ఎన్నికల్లో అధికారం కోసం బీజేపీ-కాంగ్రెస్ పార్టీలు మల్లగుల్లాలు పడుతున్నాయి. కర్ణాటకలో అధికారం చేపట్టేందుకు కాంగ్రెస్‌, బీజేపీ సై అంటున్నాయి. ఇందుకోసం వ్యూహ, ప్రతి వ్యూహాలు పన్నుతూ.. అధికారం కో

కర్ణాటక ఎన్నికల్లో అధికారం కోసం బీజేపీ-కాంగ్రెస్ పార్టీలు మల్లగుల్లాలు పడుతున్నాయి. కర్ణాటకలో అధికారం చేపట్టేందుకు కాంగ్రెస్‌, బీజేపీ సై అంటున్నాయి. ఇందుకోసం వ్యూహ, ప్రతి వ్యూహాలు పన్నుతూ.. అధికారం కోసం పాకులాడుతున్నాయి. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మంగళవారం వెలువడ్డాయి. ఈ ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ 104 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. 
 
అలాగే, కాంగ్రెస్‌ పార్టీకి 78, జేడీఎస్‌కు 38, ఇతరులు 2 చోట్ల గెలుపొందారు. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్, జేడీఎస్‌లు సంసిద్ధత వ్యక్తం చేస్తున్నాయి. అయితే అధికారం కోసం కాంగ్రెస్, జేడీఎస్ ఒక్కటయ్యాయి. బీజేపీకి అధికారం దక్కకూడదనే ఉద్దేశంతో కాంగ్రెస్ జేడీఎస్‌తో చేతులు కలిపేందుకు సిద్ధమని ప్రకటించింది. 
 
ఇందులో భాగంగా జేడీఎస్ చీఫ్ కుమార స్వామిని సీఎం చేసేందుకు సిద్ధంగా వున్నట్లు తెలిపింది. ఈ క్రమంలో కాంగ్రెస్, జేడీఎస్‌ నేతలు గవర్నర్‍‌ను కలిశారు. అలాగే బీజేపీ సీఎం అభ్యర్థి యడ్యూరప్ప కూడా గవర్నర్‌తో భేటీ అయ్యారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు. దేవేగౌడ రెండో తనయుడు రేవణ్ణకు డిప్యూటీ ముఖ్యమంత్రి పదవి ఇస్తామని బీజేపీ ఆఫర్‌ చేసింది. రేవణ్ణకు 12 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని యడ్యూరప్ప గవర్నర్‌తో తెలిపారు. 
 
దీంతో కర్ణాటక రాజకీయాలు మరోమారు కీలక మలుపు తీసుకున్నాయి. దేవేగౌడకు నలుగురు తనయులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. దేవేగౌడ మూడో కుమారుడు కుమారస్వామి. కుమారస్వామి ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై రేవణ్ణకు వ్యతిరేకత ఉన్నట్లు సమాచారం. 
 
ప్రభుత్వ ఏర్పాటు దిశగా ప్రయత్నాలు సాగిస్తున్న బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి యడ్యూరప్ప గవర్నర్‌తో రేవణ్ణ వర్గం మద్దతు పార్టీకి ఉన్నట్లు చెప్పారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కోరారు. దీంతో జేడీఎస్‌లో చీలిక తలెత్తుతుందోమోనేనే అనుమానాలు బలపడుతున్నాయి. ఈ వ్యవహారంలో గవర్నర్ నిర్ణయమే కీలకం కానుంది.