శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 2 ఏప్రియల్ 2021 (09:54 IST)

హుండీలో కండోమ్.. ఆలయంలోనే మూత్రం పోశారు.. అంతే ఒకరు మృతి.. మరో ఇద్దరు..?

Lord Koragajja
కలియుగం అంటే ఇలానే వుంటుందని ఎందరో మహానుభావులు ముందే చెప్పారు. ఆ మహనీయుల మాటలు నిజమవుతూ వస్తున్నాయి. దేవతల పట్ల భక్తి కనుమరుగవుతుందని.. దైవమంటే ఏ మాత్రం భయం వుండదని చెప్పారు. అలాంటి చర్యే ప్రస్తుతం సంచలనానికి దారితీసింది. దేవుడంటే భయంలేని ముగ్గురు మూర్ఖులు.. వికృత చర్యలకు పాల్పడుతూ.. ఆలయాలను అపవిత్రం చేస్తున్నారు. 
 
ఓ ఆలయంలోని హుండీలో కండోమ్ వేశారు. మరో దేవాలయం ప్రాంగణంలో మూత్రం పోశారు. ఐతే ఈ ముగ్గురిలో తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. రక్తపు వాంతులతో చనిపోయాడు. అంతే.. మిగతా ఇద్దరికీ భయం పట్టుకుంది. ఆ దేవుడి ప్రకోపానికి బలికాక తప్పదని వణికిపోయారు. చేసిన తప్పును తెలుసుకొని.. క్షమించమని ప్రార్థించారు. చివరకు అరెస్టై జైల్లో ఊచలు లెక్కపెడుతున్నారు. మహారాష్ట్రలోని మంగళూరులో ఈ ఘటన చోటు చేసుకుంది
 
వివరాల్లోకి వెళితే.. మంగళూరులో కొరగజ్జ స్వామి ఆలయం ఉంది. కొరగజ్జ స్వామి తుళు ప్రజల ఆరాధ్య దైవం. శివుడి మరో రూపంగా ఆయన్ను భావిస్తారు. అలాంటి ఆలయం హుండీలో ఇటీవల ఓ కండోమ్ బయటపడింది. హుండీ డబ్బులు లెక్కపెడుతున్న సమయంలో కండోమ్ బయటపడడంత ఆలయ పూజారులు షాక్ తిన్నారు.
 
ఎవరు చేశారో అర్ధం కాలేదు. ఆ తర్వాత కొన్ని రోజులుగా అదే మంగళూరులోని వేరొక ఆలయంలో ఇదే తరహ ఘటన జరిగింది. హుండీలో చిట్టీలు కనిపించాయి. వాటిని ఓపెన్ చేసి చూస్తే.. అభ్యంతరకర పదాలు రాసి ఉన్నాయి. ఎవరో దేవుడిని తిడుతూ వాటిని హుండీలో వేశారు. మరో ఆలయం ప్రాంగణంలో గుర్తు తెలియని వ్యక్తులు మూత్రం పోశారు. ఇలా వరుస ఘటనల నేపథ్యంలో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
 
ఈ క్రమంలోనే ఇద్దరు వ్యక్తులు కొరగజ్జ ఆలయానికి వెళ్లి చేసిన నేరాన్ని ఒప్పుకున్నారు. ఈ ముగ్గురు మంగళూరులోని జొకట్టి ప్రాంతానికి చెందిన నవాజ్ (36), రహీమ్ (32), తౌఫీక్ (35) మంచి స్నేహితులు. నవాజ్ ఏడాదిన్నర క్రితం దుబాయ్ నుంచి ఇండియాకు తిరిగొచ్చి ఇక్కడే ఉంటున్నాడు. ఐతే కొన్ని రోజుల క్రితం ఈ ముగ్గురు కొరగజ్జ స్వామి ఆలయానికి వెళ్లి హుండీలో కండోమ్ వేశారు. 
 
నవాజ్ కండోమ్ వేయగా.. అతడితో పాటు రహీమ్, తౌఫీక్ ఉన్నారు. ఆ తర్వాత మరో రెండు ఆలయాల్లోనూ ఇలాంటి వికృత చేష్టలకే పాల్పడ్డారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా దొరకలేదు. కొన్ని రోజుల తర్వాత నవాజ్ ఆరోగ్యం విషమించింది. రక్తపు వాంతులు చేసుకున్నాడు. ఎవరో తనను శిక్షిస్తున్నట్లుగా నిత్యం బాధపడేవాడు.
 
ఈ క్రమంలోనే తలను గోడకేసి కొట్టుకొని అతడు మరణించాడు. మరో ఇద్దరు కూడా తాము కూడా చనిపోతామేమోనని భయపడ్డారు. అంతేకాదు తౌఫీక్‌ కూడా అనారోగ్యం పాలయ్యాడు. వాంతుల్లో రక్తం పడుతోంది. వీరి భయం మరింత ఎక్కువయింది.
 
చేసిన తప్పును తెలుసుకొని మళ్లీ కొరగజ్జ స్వామి ఆలయానికి వెళ్లారు. జరిగిన విషయాన్ని పూజరికి చెప్పి..తమను క్షమించమని దేవుడిని ప్రార్థించారు. ఇప్పటికే ఆలయాల్లో వికృత చేష్టలకు సంబంధించి పోలీసులకు ఫిర్యాదు అందడం, ఈక్రమంలోనే ఇద్దరు వ్యక్తులు కొరగజ్జ స్వామి ఆలయానికి వెళ్లి నేరాన్ని అంగీకరించడంతో... పోలీసులు వారిద్దరిని అరెస్ట్ చేశారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.