సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్

ఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభం... ఏపీ బాధ్యతలు ఆయనకు..

Talasani Srinivasa Yadav
ఢిల్లీలో భారత్ రాష్ట్ర సమితి ప్రధాన కార్యాలయాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం ప్రారంభించారు. ఆ తర్వాత ఆయన కీలక నిర్ణయాలు తీసుకున్నారు. బీఆర్ఎస్ ఏపీ బాధ్యతలను తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు అప్పగించారు. ఆయనకు ఏపీకి రాజకీయ నేతలతో మంచి సంబంధాలు ఉన్నాయి. 
 
దీంతో ఆయనకు కీలక బాధ్యతలను అప్పగించారు. ఇందులోభాగంగా, ఇప్పటికే ఆయన హైదరాబాద్ నగరంలో ఉన్న ఏపీకి చెందిన రాజకీయ ప్రముఖులతో సంప్రదింపులు కూడా మొదలుపెట్టారు. తెలుగు ప్రజలు ఎక్కువగా ఉండే రాష్ట్రాల్లో పోటీ చేయాలన్న ఆలోచనలో బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఉన్నారు. 
 
ఇందులోభాగంగా, ఏపీ నడిబొడ్డున భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. పైగా, ఈ బహిరంగ సభ బాధ్యతలను కూడా ఆయన తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు అప్పగించారు. జాతీయ పార్టీ అధికారిక గుర్తింపు కోసం తెలుగు ప్రజలు అత్యధికంగా ఉండే రాష్ట్రాల్లో పోటీ చేయాలని సీఎం కేసీఆర్ ఉన్నారు. ఇందులోభాగంగా, తొలి దశలో ఏపీ, కర్నాటక, తమిళనాడు, మహారాష్ట్ర వంటి ప్రాంతాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను బరిలోకి దించనున్నారు.