శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 24 డిశెంబరు 2019 (10:09 IST)

కిచెన్‌లో శవమై కనిపించిన టీవీ నటి, మోడల్ జాగీ జాన్

సెలబ్రిటీ టీవీ నటి, మోడల్, చెఫ్ అయిన జాగీ జాన్ కిచెన్‌లో శవమై కనిపించింది. కేరళ, తిరువనంతపురంలో తన ఫ్లాట్‌లోని కిచెన్‌లో శవమై కనిపించింది. ఆమె మరణాన్ని పెరూర్కాడా పోలీసులు నిర్ధారించారు. జాగీ ఆ ఇంట్లో తన తల్లితో కలిసి ఉంటోంది. ఓ టీవీలో ఆమె జాగీస్ కుక్ బుక్ ఆన్ రోజ్ బౌల్ పేరుతో ఓ వంట షో నిర్వహిస్తోంది. బ్యూటీ, పర్సనాల్టీ షోలను కూడా చేస్తోంది.
 
జాగీ ఓ సింగర్, మోటివేషనల్ స్పీకర్ కూడా. పై ఫొటోలను బట్టే అర్థం చేసుకోవచ్చు ఆమె చాలా బోల్డ్ అని కూడా. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండేది. ఐతే... జాగీ జాన్ పెట్టే పోస్టులు, ఫొటోలపై చాలా మంది విమర్శలు చేస్తున్నారు. దీనిపై గతేడాది కౌముదీ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో జాగీ తన అభిప్రాయం చెప్పింది. తాను ఇన్స్‌పిరేషనల్ మెసేజెస్ పోస్ట్ చేస్తున్నట్లు తెలిపింది.

జాగీ తాజాగా ఆదివారం ఉదయం పెట్టిన లాస్ట్ పోస్టులో... "2019లో నీ కన్నీటి బిందువులు... 2020లో నువ్వు వేసుకున్న ప్లాన్లకు విత్తనాలు అవుతాయి". అని పెట్టింది. దీన్ని బట్టీ ఆమె సూసైడ్ చేసుకుందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.